దేశంలో కరోనా పంజా విసురుతున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి చాపకింద నీరు లాగా కరోనా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. రోజుకి ఎన్నో లక్షల కేసులు నమోదవుతున్నాయి.ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా పంజా విసురుతుంది. ఇక గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే ఏపీలో 5,096 కరోనా కేసులు నమోదయినట్లు సమాచారం తెలుస్తుంది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9 లక్షల 42వేల 135 కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో 14 మంది మరణించారు. కరోనాతో చిత్తూరులో ఐదుగురు, అనంతపురం, కర్నూల్, విశాఖపట్టణంలలో ఇద్దరు చొప్పున చనిపోయారు. కడప, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరిచొప్పున మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,353 కి చేరుకొంది.రాష్ట్రంలో ఇప్పటివరకు 1,55,70,201 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 35,741 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో5,086మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది.



గత 24 గంటల్లో అనంతపురంలో 334, చిత్తూరులో 835,తూర్పుగోదావరిలో 450,గుంటూరులో 611, కడపలో 096,కృష్ణాలో 396, కర్నూల్ లో 626, నెల్లూరులో 223,ప్రకాశంలో 236, శ్రీకాకుళంలో 568, విశాఖపట్టణంలో 432, విజయనగరంలో 248,పశ్చిమగోదావరిలో 031కేసులు నమోదయ్యాయి.గత 24 గంటల్లో 1,745 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఏపీలో ఇప్పటివరకు 9 లక్షల 03 వేల 072 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 31,710 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.కాబట్టి చాలా జాగ్రత్తగా బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా వాడాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి. అలాగే ఇంటి నుంచి ఎక్కువగా బయటికి రాకుండా ఒకేవేళ వచ్చిన కాని పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.ఇక ఇలాంటి మరెన్నో కరోనా అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: