తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక పోలింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఒక్క రోజు ఆగితే ప్రధాన రాజకీయ పార్టీల జాతకాలను తిరిగ‌రాసేందుకు జనాలు రెడీ గా ఉన్నారు. ఎవరు ఏంటి అన్నది ఈవీఎం మిషన్ల ద్వారా తమ అభిప్రాయాలను ప‌క్కా క్లారిటీగా తెలియచేయనున్నారు.

ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ తనకు భారీ మెజారిటీ వస్తుంది అని చాలా ఆశలు పెట్టుకుంది.ఇక టీడీపీ అయితే మొత్తం పొలిటికల్ గ్రౌండ్ లో దున్నేశామని అనుకుంటోంది. ఎటూ సీఎం జగన్ రాలేదు, పవన్ ఒక్కసారి వచ్చి వెళ్ళారు. దాంతో మొత్తం తామే జనాలకు స్టార్ కాంపెనియర్లమని కూడా  భావిస్తోంది. మొత్తం టీడీపీని తిరుపతికి షిఫ్ట్ చేసి మరీ చేయాల్సింది అంతా చేశామని కూడా ధీమాగా ఉంది.

ఇక తిరుపతిలో బీజేపీ కూడా మంచిగానే తన సత్తా చాటుతాను అని భావిస్తోంది. గత ఎన్నికలు వేరు ఈ ఎన్నికలు వేరు అంటూ కమలనాధులు కొత్త భాష్యాలు చెబుతున్నారు. మరి ఇలా ప్రధాన పార్టీలు తమకు తోచిన విధంగా లెక్కలు వేసుకోవడమే కాదు  ఆశ పడడం వరకూ బాగానే ఉన్నా కూడా అసలు కధ ఇపుడు జనాల చేతుల్లో ఉంది.

జనాలు వచ్చి ఓటు చేయాలి. వారు వచ్చి ఓట్లు వేస్తేనే పోలింగ్ జరిగినట్లు. ఎవరి ఆశలు అయినా తీరినట్లు. మరి జనాలకు ఎంత వరకూ ఉప ఎన్నికల మీద  ఆసక్తి ఉంది. తిరుపతి ఉప ఎన్నిక విషయంలో జనాలు ఏమనుకుంటున్నారు అన్నది 17న తేలబోతోంది. నిజానికి అధికార పార్టీ మీద అభిమానం ఉంటే వెల్లువలా జనాలు తరలి రావాలి అపుడే భారీ మెజారిటీ దక్కేది. ఇక విపక్షాలు ఊహిస్తున్నట్లుగా వారి ఊహలు నెరవేరాలనుకున్నా కూడా జనాల తిరునాళ్ళు తిరుపతి లో జరగాలి. మరి అంత సీన్ ఉందా. జనాలు ఓటింగ్ కి పెద్ద సంఖ్యలో రాకపోతే ఫలితాల్లో కూడా తేడా వచ్చేస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: