ఢిల్లీ రాజకీయ రంగ స్థలి. అన్ని పార్టీలకు అక్కడే వేదిక. దేశ రాజకీయాలను శాసించాలంటే ఢిల్లీకి మించిన స్థానం, స్థావరం వేరొకటి ఉండబోదు. ఇక దేశంలో పరిస్థితులు ఎప్పటికపుడు మారుతూ ఉంటాయి.

ఒకనాడు మోడీకి జై అన్న వారే ఇపుడు తగ్గుతున్నారు. దేశంలో ఏడేళ్ల క్రితం నాటి పరిస్థితులు ఇపుడు లేవు అని చెప్పాలి. మోడీ మీద మోజూ క్రేజీ నెమ్మదిగా కరుగుతున్న పొలిటికల్ సీన్ ఉంది. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు మోడీ ని ఢీ కొట్టే సరకూ సరంజామాతో దేశంలోని పెద్ద నేతలంతా ఢిల్లీ చేరి బస్తీ మే సవాల్ అని అంటారని తెలుస్తోంది. తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్ గెలవడం ఖాయమని అంటున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ లోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ మూడవ సారి కూడా ముఖ్యమంత్రి పీఠం పట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది అంటున్నారు. ఈ ఇద్దరూ ఉంటే చాలు ప్రతిపక్ష శిబిరానికి ఫుల్ జోష్ హుషార్ వస్తుంది. దేశంలో రాజకీయాలు మారాలని శరద్ పవార్ నుంచి దేవెగౌడ వరకూ ఇంకా చెప్పాలంటే కేసీయార్ దాకా చూస్తున్నారు.

ఇక మమత కనుక గెలిస్తే ఢిల్లీలో మోడీ వ్యతిరేక ఫ్రంట్ రూపుదిద్దుకోవడం ఖాయమని అంటున్నారు. మోడీకి ఎన్డీయేకి మిత్రులు ఓ వైపు తగ్గిపోతున్న పొలిటికల్  సీన్ ఉంది. దీంతో విపక్షాలు జూలు విద్లిస్తే జాతీయ రాజకీయాలు కొత్త మలుపు తీసుకోవడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఢిల్లీ ఫ్రంట్ కధలు మళ్ళీ వినాల్సివస్తుందని అంటున్నారు ఇప్పటికే మూడవ ఫ్రంట్ అంటూ విపక్షాల కలవరింపులు కూడా ఎక్కువ అయిపోయాయి. దేశంలో కాంగ్రెస్ కూడా అతి పెద్ద ప్రాంతీయ పార్టీగా మారిపోయిన నేపధ్యంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్  సహా ప్రాంతీయ పార్టీల పెద్ద తలకాయలు అన్నీ కూర్చిని రాజకీయ వంటకం వండితే కచ్చితంగా యాంటీ మోడీ ఫ్రంట్ ఆవిర్భవిస్తుంది అంటున్నారు. చూడాలి మరి




మరింత సమాచారం తెలుసుకోండి: