ఈ మధ్యకాలంలో ఎంతోమంది చిన్న చిన్న చిలిపి చేష్టలతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎన్నో తెరమీదకు వస్తున్నాయి. సరదాగా చేయాలనుకున్న పని చివరికి ప్రాణాల మీదికి వచ్చి కుటుంబంలో విషాదం ఏం పీకుతున్నాయ్. కొంతమంది వాహనం నడుపుతూ చిత్రవిచిత్రమైన ఫీట్స్ చేయడం వల్ల చివరికి రోడ్డు ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతుంటే మరికొంతమంది మరింత విచిత్రంగా ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు గతంలో ఒక యువకుడు ఏకంగా ట్రైన్ స్పీడ్గా వెళ్తున్న సమయంలో ట్రైన్ లో నుంచి దూకి టిక్ టాక్ చేయాలనుకుని చివరికి ప్రాణాపాయ స్థితికి వెళ్లిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే.


 ఈ మధ్యకాలంలో ఇలా సెల్ఫీ పిచ్చి ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంటుంది.  సరదాగా సెల్ఫీ తీసుకోవడం వరకు ఓకే కానీ ప్రాణాలు పోయేలా సెల్ఫీ తీసుకుంటున్నారు నేటి రోజుల్లో ఎంతోమంది. స్మార్ట్ఫోన్ యుగంలో రోజురోజుకీ సెల్ఫీ పిచ్చి పెరిగిపోతుంది. ఇక సెల్ఫీ పిచ్చి కాస్త అతిగా పెరిగిపోవడంతో ఎంతోమంది ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లి సెల్ఫీ తీసుకోవాలని భావించి ప్రమాదవశాత్తు చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.



 సరదాగా సెల్ఫీ తీసుకుందాం అనుకున్న 16 ఏళ్ల బాలుడు చివరికి ప్రాణాలు  పోయే పరిస్థితి తెచ్చుకున్నాడు. సెల్ఫీ తీసుకోవడం కోసం ఏకంగా రైలు పైకి ఎక్కాడు 16 ఏళ్ల యువకుడు.  దీంతో కరెంట్ తీగలు తాకి విద్యుదాఘాతానికి గురై అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని మంగళూరులో వెలుగులోకి వచ్చింది. జోకట్టే  రైల్వేస్టేషన్లో పదహారేళ్ల మహమ్మద్ దిశాన్ అనే వ్యక్తి సెల్ఫీ తీసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఏకంగా సరికొత్తగా ప్రయత్నించాలని భావించి రైలు మీద ఎక్కాడు.   విద్యుత్ తీగలు తగలడంతో 50% కాలి. ఇక స్థానికులు గమనించి అతన్ని ఆస్పత్రికి తరలించే లోపే చివరికి ప్రాణాలు వదిలాడు బాలుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: