ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 6 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు చేరాయి. వాటిని వైద్యారోగ్య శాఖ జిల్లాలకు పంపిణీ చేసింది. ప్రాధాన్యతల వారీగా కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ సిబ్బందికి కరోనా వాక్సినేషనులో హై ప్రయార్టీ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు ఫ్రంట్ లైన్ వర్కర్లకు.. హెల్త్ కేర్ వర్కర్లకు వచ్చే 72 గంటల్లో వంద శాతం మేర వ్యాక్సినేషన్ చేయాలని కలెక్టర్లకు సూచనలు అందాయి. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో ఫ్రంట్ లైన్ వర్కర్లు హెల్త్ కేర్ సిబ్బంది కీలకం కావడంతో టీకాలు వేయాలి అని సీఎం జగన్ ఆదేశించారు. 

ఇంకా 1.80 లక్షల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్‌ కేర్‌ సిబ్బంది కరోనా టీకాలు వేసుకోలేదని అంటున్నారు. కరోనా టీకాలు వేయించుకోని ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్‌ కేర్‌ సిబ్బందిలో కృష్ణా, విజయనగరం జిల్లాల వారే అధికం ఉంటున్నారని అంటున్నారు. సెకండ్‌ ప్రయార్టీగా రెండో డోస్ వేయించుకోవాల్సిన పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. మరిన్ని డోసులు కావాలంటూ కేంద్రాన్ని వైద్యారోగ్య శాఖ కోరినట్టు చెబుతున్నారు. అలానే వచ్చిన ఆరు లక్షల డోసులు ఒక్క రోజుకు కూడా చాలవని అంటున్న వైద్యారోగ్య శాఖ అధికారులు.

 మరో పక్క ఏపీలో వేగంగా కరోనా విస్తరిస్తోంది. మొత్తం ఏడు వేల కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 7224 కొత్త కేసులు నమోదు, 15 మరణాలు నమోదయ్యాయి. యాక్టీవ్‌ కేసుల సంఖ్య 40469కు చేరుకుంది. చిత్తూరు జిల్లాలో వరుసగా రెండో రోజు కూడా వేయి కేసులకు పైగా నమోదు అయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1051 కేసుల నమోదు అయ్యాయి. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 96 కేసుల నమోదు అయ్యాయి. వేయి కేసులకు చేరువలో తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో 906, గుంటూరు జిల్లాలో 903 కేసుల నమోదయ్యాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: