తెలంగాణలో గత మూడు నెలల నుంచి కూడా ఎన్నికల సందడి హాట్ టాపిక్ గా మారింది. దుబ్బాక ఉప ఎన్నికల నుంచి కూడా తెలంగాణలో ఎన్నికలు రాజకీయ పార్టీలను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. నాగార్జునసాగర్ ఎన్నికల తర్వాత ఇప్పుడు వరంగల్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా పలు మున్సిపల్ స్థానాలకు కూడా ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార పార్టీ ఎలాగైనా సరే ఎన్నికల్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా వ్యవహరిస్తోంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు నేటితో ముగిసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మంత్రులు వరంగల్ మీద గట్టిగా దృష్టి పెట్టారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆరెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతుందనడం హాస్యాస్పదం అన్నారు. వరంగల్ పట్టన అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేసాం అని చెప్పుకొచ్చారు.మిషన్ భగీరథ 950 కోట్లను అమృత పథకం కింద ఖర్చు చేసాం అని తెలిపారు మంత్రి. కేంద్ర ప్రభుత్వం నుండి రావలసిన బడ్జెట్ ను తెలంగాణా లో ఎక్కడ ర్చు చేసావో బండి సంజయ్ చెప్పాలి అని సవాల్ చేశారు.

మొన్నటి హైదరాబాద్ వరదల్లో నష్టపోయిన ప్రజలకు కేంద్రం నుండి ఏం సాయం చేసావో బండి సంజయ్ చెప్పాలి అని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో తెలంగాణా కి కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు ఎన్ని తెచ్చావ్ అని ప్రశ్నించారు. విభజన చట్టము కింద వరంగల్ కి కోచ్ వ్యగన్ ఇస్త అన్నారు అని బీజేపీ మాయమాటలను వరంగల్ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అని పేర్కొన్నారు.తల వంచైనా కాజిపేట్ కు కోచ్ వ్యగన్ తెచ్చుకుంటాం అని స్పష్టం చేశారు.గుజరాత్, మహారాష్ర్ట, రాష్ట్రాలకు సక్రమంగా ఒప్పుకున్న వాటాలను ఇస్తున్నారు అని తెలంగాణా ప్రజల న్యాయమైన వాటాలను కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదనీ నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: