ఏ ఎన్నికకు అయినా పోల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అన్నది అందరికీ తెలిసిందే. ఎన్నికలు అన్నవి ప్రజల కోసం అని అంటారు. ప్రజల పాత్ర చాలా ఉంది అంటారు. కానీ వాటి కంటే ముందు రాజకీయ పార్టీలే మధ్యన దూరిపోతాయి. అవే ఎన్నికల లో అత్యంత కీలకపాత్ర పోషిస్తాయన్నది తెలిసిందే.

ఇదిలా ఉంటే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఎందుకు ప్రతిష్టాత్మకం అయింది అన్నది కనుక ఆలోచన చేస్తే ఎందుకు అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ గట్టిగా తీసుకున్నాయి అన్నది కూడా  అర్ధం అవుతుంది. ఇదిలా ఉంటే ఏపీలో  తిరుపతి ఉప ఎన్నిక ఫలితాన్ని దేశమంతా చూడాలని జగన్  పార్టీ వారితో అన్నట్లుగా ప్రచారం జరిగింది. ఇక తెలుగుదేశం అయితే వైసీపీ భారీ మెజారిటీని ఇక్కడ అడ్డుకోకపోతే తమ పార్టీకి ఏపీలో భవిష్యత్తులో  ఇబ్బందులు తప్పవు అని గ్రహించే ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా  తయారు అయింది.

ప్రచార పర్వాన్ని దాదాపుగా విజయవంతంగా పూర్తి చేసిన టీడీపీ పోల్ మేనేజ్మెంట్ లోనూ గట్టిగానే ఉంది. ప్రతీ పోలింగ్ బూత్ వద్ద టీడీపీ కరడు కట్టిన కార్యకర్తలను పెట్టింది. ఇక పార్టీ నేతలను కూడా పర్యవేక్షణకు ఉపయోగించుకుంది. మరో వైపు వైసీపీ అక్రమ మార్గాలకు దిగితే కచ్చితంగా అడ్డుకట్ట వేయడానికి కూడా టీడీపీ రెడీగా ఉంది. మొత్తానికి చూస్తే టీడీపీ తిరుపతిని ఏ మాత్రం లైట్ గా తీసుకోలేదు అందుకే వైసీపీ దొంగ ఓట్లు వేయించడానికి చూసిందని గట్టిగానే పోరాడింది. నిజానికి గెలుపునకు ఢోకా లేకపోయినా మెజారిటీ కోసమే వైసీపీ అధికారాన్ని వాడుకుంటోంది అని మొదటి నుంచి ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. మొత్తానికి వైసీపీ అధికారం లో ఉన్న అండతో ప్రతీ పోలింగ్ బూత్ లో గట్టిగానే పోల్ మేనేజ్మెంట్ చేసుకుంది. ఈ రెండు పార్టీలలో ఎవరు సక్సెస్ అయ్యారు అన్నది మే 2న ఫలితం లోనే తేలేది.


మరింత సమాచారం తెలుసుకోండి: