కరోనా సెకండ్ వేవ్ లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి అని తెలంగాణా డిహెచ్ శ్రీనివాస రావు అన్నారు.  నిన్న సుమారు 5 వేల కరోనా కేస్ లు నమోదు అయ్యాయి అని వెల్లడించారు.  వైరస్ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళింది అని ఆయన అన్నారు. ప్రపంచదేశాలు కకరోనా కి మొకరిల్లుతున్నాయి అని తెలిపారు.   ప్రపంచ వ్యాప్తంగా స్పానిష్ ఫ్లూ మొదటి వేవ్ లో 30 నుంచి 50 లక్షల మంది చనిపోయారు అని అన్నారు. స్పానిష్ ఫ్లూ రెండో వేవ్ లో  2 నుంచి 7 కోట్ల మంది మృతి చెందినట్టు సమాచారం ఉందని అన్నారు.

 మార్చ్ 24 న తెలంగాణ లోని ఓ జిల్లాకి మహారాష్ట్ర నుంచి 20మంది ఉత్సవం కోసం వచ్చారు మరో 30 మంది తెలంగాణ వాళ్ళు వారికి జత కలిశారు. ఆ తరువాత 4వ తేదీకి టెస్ట్ లు చేస్తే అందులో 34 మందికి కరోన వచ్చింది అని ఆయన అన్నారు.  ఆ ఘటన తరువాత వల్ల కాంటాక్ట్ లు కలిపి 433 మందికి వైరస్ సోకింది అని వెల్లడించారు. రాష్ట్రంలో ఇదే అతి పెద్ద అవుట్ బ్రేక్ అన్నారు ఆయన. వైరస్ కొన్ని గంటల్లోనే కుటుంబ సభ్యులకు సోకుతోంది అని వెల్లడించారు.  రాష్ట్రంలో డబుల్ మ్యుటేషన్ లు వచ్చాయి అని ఆయన పేర్కొన్నారు.

టెస్ట్ ల సంఖ్య పెంచామని వెల్లడించారు. 2.98 శాతం తెలంగాణ లో పాజిటివిటీ రేట్ ఉందని, ఏప్రిల్ 1వ తేదీ నాటికి 1.5 మాత్రమే పాజిటివిటీ రేట్ ఉండేది అని ఆయన పేర్కొన్నారు.  ప్రైమరీ హెల్త్ కేంద్రాలకు టెస్ట్ ల కోసం భారీగా వస్తున్నారు అని ఆయన అన్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 38600బెడ్స్ కి పెంచామని తెలిపారు.  రాబోయే రోజుల్లో 53 వేలకు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.  5000 ఆక్సిజన్ బెడ్స్ ప్రైవేట్ లో   ఉన్నాయి అని, కొన్ని పెద్ద ఆస్పత్రుల్లో మాత్రమే బెడ్స్ లేవు అని వివరించారు.  కోవిడ్ బాధితుల్లో 80 శాతం మందికి ఎలాంటి లక్షణాలు ఉండటం లేదు అని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: