గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో బిజెపి ఎంత దూకుడుగా వ్యవహరిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ముఖ్యంగా ఇక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తిరుగులేని పార్టీగా చరిష్మా కొనసాగిస్తున్న టిఆర్ఎస్ పార్టీకి పలుమార్లు బీజేపీ షాక్ ఇచ్చింది అని చెప్పాలి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానమైన దుబ్బాక లో ఉప ఎన్నికలలో  ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన   బీజేపీ టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చి విజయం సాధించింది. అదే సమయంలో ఎప్పటికప్పుడు అటు అధికార పార్టీ తీరును ఎండగడుతూ విమర్శలు చేస్తూనే ఉంది.


 ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువగా అధికార పార్టీపై విమర్శలు చేస్తూ వస్తుంది బిజెపి. అదే సమయంలో ఇక మొన్నటికి మొన్న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తో సమానంగా  సీట్లు గెలవడం మరింత ఆసక్తికరం గా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ టీఆర్ఎస్ మధ్య అగ్గిపుల్ల వేస్తే భగ్గుమంటుందేమో అన్న విధంగా మారిపోయింది పరిస్థితి.  ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల చోటు చేసుకున్న ఒక పరిణామం ఎంతో కీలకంగా మారిపోయింది.



 బిజెపి ఎన్నికల నుంచి తప్పుకోవాలంటూ అధికారపార్టీకి సూచించడంతో ఇక బీజేపీ అడిగిందే తడవుగా టిఆర్ఎస్ ఎన్నికల నుంచి తప్పుకోవడం ఆసక్తికరంగా మారిపోయింది. ఇటీవలే జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో లింగోజిగూడ లో రమేష్ అనే వ్యక్తి బిజెపి నుంచి కార్పొరేటర్ గా గెలుపొందారు.  అయితే ఇటీవలే ఆయన అనారోగ్యం బారిన పడి మృతి చెందారు. ఈ క్రమంలోనే అక్కడ మళ్లీ ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల స్థానిక బిజెపి నేతలు మంత్రి కేటీఆర్ ను కలిసి ప్రమాణం కూడా చేయకముందే చనిపోయిన కార్పొరేటర్ రమేష్ కొడుకుని పోటీలో నిలబెడుతున్నామని.. టీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకోవాలని కోరటం అటు వెంటనే కేటీఆర్ కూడా దీనికి అంగీకరించడం చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఇది రాజకీయాల్లో ఒక శుభపరిణామం అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: