తెలంగాణలో వైయస్ షర్మిల పార్టీ పెట్టడంతో ఇప్పుడు కొంత మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఇబ్బంది పడుతుందనే భావన ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా షర్మిల కారణంగా ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉండవచ్చు. వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు ఎక్కువగా షర్మిల పార్టీలోకి వెళ్లే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా వరకు జాగ్రత్తగానే ముందుకు వెళ్తున్నది. అయితే రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కొన్ని కొన్ని అంశాలు కీలకంగా మారే అవకాశాలున్నాయని అంటున్నాయి.

రాజకీయ తెలంగాణలో షర్మిల ప్రభావంపై టిఆర్ఎస్ పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెరాస పార్టీ అధినేత కేసీఆర్ షర్మిల విషయంలో కొన్ని అంచనాలు వేసుకుంటున్నారు. అయితే ఈ అంచనాల ఆధారంగా చూస్తే తెలంగాణలో షర్మిల రెండు మూడు జిల్లాల్లోనే ప్రభావం చూపించవచ్చు. ఇక భారతీయ జనతాపార్టీ కూడా ఆమె విషయంలో దాదాపు అదే అభిప్రాయంలో ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ షర్మిలను ఎదుర్కొనే విషయంలో కొన్ని అంశాలను ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశాలు ఉండవచ్చు అనే భావనలో రాజకీయ వర్గాలు ఉన్నాయి.

ఎందుకు ఏంటి ఒకసారి చూస్తే తెలంగాణలో షర్మిల పార్టీ పెడితే చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఆమె పార్టీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ విషయంలో చాలా వరకు టీడీపీ వాళ్ళు సీరియస్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వైఎస్ కుటుంబంపై కూడా చాలా కోపం ఉంది. అందుకే షర్మిలపై పోరాడే విషయంలో మాతో కలిసి రావాలని బీజేపీ నేతలు కోరే అవకాశాలు ఉండవచ్చు అని ఒకవేళ తెలంగాణా లో పార్టీ పెట్టి విజయవంతం అయితే మాత్రం కొన్ని వర్గాలు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నాయి. దీనిని బిజెపి బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: