తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ అభ్యర్ధిగా దూసుకువచ్చిన మాజీ ఐఏఎస్ అధికారిణి రత్న ప్రభ లేట్ గా వచ్చినా లేటెస్ట్ అన్నట్లుగానే రాణించారు అన్న మాట అయితే ఉంది. ఆమె బీజేపీకి కొత్త నాయకురాలిగా ఏపీలో ఎదిగే అవకాశం ఉంది అంటున్నారు.

ఆమె విశ్రాంత అధికారిణిగా కర్నాటకలో  ఉంటే  కోరి మరీ తీసుకువచ్చి మరీ బీజేపీ అభ్యర్ధిగా చేశారు. ఆ తరువాత ఆమె తన సత్తా చూపించారు. ఆమె తన అధికారిక అనుభవాన్ని, ఏపీలో పనిచేసిన అనుభవనాన్ని కూడా బాగానే ఉపయోగించుకున్నారు. నిజానికి బీజేపీకి ఆమె మంచి అసెట్ గా మారారు అని అంటున్నారు. ఉన్నత విద్యావంతురాలు కావడంతో ఆమె తొందరలోనే రాజకీయాన్ని ఆకలింపు చేసుకున్నారు అంటున్నారు.

ఇక తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు సంగతి ఎలా ఉన్నా రత్న ప్రభకు బీజేపీలో మంచి స్థానం ఉంటుంది అంటున్నారు. ఆమెను బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటికే గుర్తించింది అంటున్నారు. అదే విధంగా కేంద్రంలో ఎటూ బీజేపీ సర్కార్ ఉండడంతో రత్న ప్రభకు మంచి అవకాశాలు కూడా భవిష్యత్తులో వస్తాయి అంటున్నారు.  ఇక రత్నప్రభ అభ్యర్ధిత్వం అటు వైసీపీకి, ఇటు టీడీపీకి కూడా కొంత కలవరం కలిగించిన సంగతి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఏది ఏమైనా రత్న ప్రభ ఫేస్ తో తిరుపతి ఎన్నికలో పోటీ చేసిన బీజేపీ కొంత మేరకు ప్రభావం చూపించినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఏది ఏమైనా బీజేపీ తిరుపతి ఆశలకు కాస్తా ఊపిరి ఇచ్చేలాగే రత్న ప్రభ ఉన్నారని అంటున్నారు. ఒక వేళ ఈ ఎన్నికల్లో ఆమె ఓడినా కూడా వచ్చే ఎన్నికలకు ఆమె అభ్యర్ధిగా ఉంచితే గెలుపు అవకాశాలు కచ్చితంగా ఉంటాయని కూడా అంటున్నారు. బహుశా బీజేపీ స్ట్రాటజీ కూడా అదేనేమో.






మరింత సమాచారం తెలుసుకోండి: