సాధారణంగా సినిమాల్లో చూస్తూ ఉంటాము వివిధ రాజకీయ నాయకులు ఇక తాము గెలవలేము అనుకున్న సమయంలో ఏదో ఒక విధంగా కుట్రలు పన్నుతూ ఉంటారు. ముఖ్యంగా దొంగ ఓటర్లను రప్పించడం ఇక ఎన్నికల అధికారుల కళ్లు కప్పి దొంగ ఓట్లు వేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే అటు నిజజీవిత రాజకీయాలలో మాత్రం ఇలాంటివి చాలా తక్కువగానే జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి.  ఎప్పుడో ఒకసారి ఇలాంటివి తెరమీదికి వస్తూ ఉంటాయి. కానీ ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో మాత్రం దొంగ ఓట్లు ఆంధ్ర రాజకీయాలను ఒక్కసారిగా ఊపేసాయి అని చెప్పాలి.



  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ పంచాయతీ పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం సాధించింది. ఇక ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుని భారీ మెజారిటీ సాధిస్తామని అధికార పార్టీ చెప్పింది.  అందుకే అటు తిరుపతి ఉప ఎన్నికల్లో డబ్బులు కూడా పంచలేదు.  కానీ తిరుపతి ఉప ఎన్నికల్లో భారీగా దొంగ ఓట్లు వేయించేందుకు అధికార పార్టీ ప్రయత్నించింది అని ప్రస్తుతం ఆధారాలతో సహా బయట పడడం సంచలనంగా మారింది. ఇతర ప్రాంతాల నుంచి బస్సులు లారీలలో 5,000 మంది వరకు రప్పించి వివిధ ప్రాంతాలలో నుంచి వారికి ఓటర్ ఐడి లు ఓటర్ స్లిప్పులు  ఇచ్చి వారితో దొంగ ఓట్లు వేయించినట్లు గా ప్రస్తుతం పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి



 ఈ దొంగ ఓట్లు కాస్త తిరుపతి ఉప ఎన్నికల్లో సంచలనంగా మారిపోయారు . అయితే తిరుపతి ఉప ఎన్నిక దొంగనోట్ల లో సరికొత్త రికార్డ్ సృష్టించే లాగే ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. అయితే మొదటి నుంచి తాము ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుతాము అని ధీమాతో ఉన్న అధికార పార్టీ ఇలాంటి చెత్త వ్యూహన్ని అమలు చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. ఈ కార్యక్రమంలో ఉండడం వల్లే ఇలాంటి పనులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వారిని బిజెపి జనసేన పార్టీ నేతలు కొంతమందిని వెనక్కి పంపినప్పటికీ భారీగానే దొంగ ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. ఏదేమైనా అధికార పక్షం వ్యవహరించిన తీరు మాత్రం ఆంధ్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: