రెమెడిసివిర్.. ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఈ మందు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కరోనా మహమ్మారిపై ఈ మందు  ప్రభావవంతంగా పోరాడుతుందని రుజువైంది. అనేక పరిశోధనలు ఇప్పటికే దీన్ని రుజువు చేశాయి. కరోనా సెకండ్ వేవ్ మన దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తోన్న సమయలో ఈ మందుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కొత్త కేసులు భారీగా పెరగడంతో ఆస్పత్రుల్లో చేరే రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకడం లేదు. కరోనా రోగులకు ఇచ్చే రెమెడిసివిర్ ఇంజెక్షన్‌ల కొరత కూడా ఏర్పడింది.


ఈ సూది మందు కోసం రోగులు క్యూ కడుతున్నారు. ఆస్పత్రుల ముందు క్యూకడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఈ మందును నిల్వ చేయకూడదని ఆంక్షలు విధించింది. అంతే కాదు.. దీని ధర తగ్గించాలని తయారు చేసే కంపెనీలను కోరింది. పలు ఫార్మా సంస్థలు కూడా కేంద్రం సూచనల మేరకు... రెమెడిసివిర్ ఇంజెక్షన్ అందరికీ అందుబాటులో ఉండేలా ధరలను తగ్గించాయి. 100 మిల్లీ గ్రాముల రెమెడిసివర్ ఇంజెక్షన్ ధరలను సవరించడంతో.. దాదాపు 50శాతం మేర ధరలు తగ్గాయి.


అయితే ఈ మందును అనవసరంగా వాడవద్దని నిపుణులు సూచిస్తున్నారు. రెమ్‌డెసివిర్‌ కరోనా నివారణకు ముఖ్యమైన ముందు కాదని  తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. అది ఇప్పటికీ పరీక్షల దశలోనే ఉందని... తీవ్రమైన లక్షణాలున్న వారికి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలని ఆయన సూచించారు.  స్వల్ప లక్షణాలున్న వ్యక్తులు సొంతంగా రెమెడిసివిర్‌ను వాడొద్దని వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు హెచ్చరిస్తున్నారు.


ప్రైవేటు వైద్యులు  కూడా అనవసరంగా రెమెడిసివిర్‌ను  వినియోగించొద్దని వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు సూచిస్తున్నారు. అంతే కాదు.. కరోనా వైరస్‌ గాలిలో ఉందని నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని... ఈ విషయాన్ని లాన్సెట్‌ అంతర్జాతీయ పరిశోధన రుజువు చేసిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితి చేయిదాటిపోతే తట్టుకునే శక్తి దేశానికి లేదన్న వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: