కొన్ని రోజుల నుంచి దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో దేశ ప్రజానీకం మొత్తం బెంబేలెత్తిపోతున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతుంది అనే విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే అటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కరోనా వైరస్ నియంత్రణకు తగిన చర్యలు చేపడుతున్నాయి. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ శరవేగంగా విజృంభిస్తూనే ఉంది.  ప్రతి ఒక్కరిలో కరోనా వైరస్ పై అవగాహన వచ్చి మాస్క్ ధరించి  భౌతిక దూరం పాటిస్తున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి పంజా విసురుతుంది.



 వెరసి రోజురోజుకు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు సంఖ్య పెరిగి పోతూనే ఉంది అయితే తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజుల క్రితం కేవలం పదుల సంఖ్యలో మాత్రమే కేసులు వెలుగులోకి వస్తే ఆ తర్వాత పదులు కాస్త వందల గా మారిపోయాయి.. ఇక వందలు ప్రస్తుతం వేలు గా మారిపోయి ప్రజలందరినీ బెంబేలెత్తిస్తున్నాయి. ఇలా రోజుకి కరుణ కేసుల సంఖ్య పెరిగి పోతూనే ఉంది. ఈ క్రమంలోనే అటు ప్రభుత్వం కూడా ఎన్నో నియంత్రణ చర్యలు కూడా చేపడుతుంది. కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో అటు ఆసుపత్రిలో బెడ్స్ కొరత ఏర్పడే అవకాశం ఉంది అని భావిస్తున్న అధికారులు  కరోనా వైరస్ బారిన పడిన వారు కేవలం అత్యవసరమైతే తప్ప ఆసుపత్రికి రావొద్దు అంటూ సూచిస్తున్నారు.



 తాజాగా ఇదే విషయంపై తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ తీవ్రతను తట్టుకునే శక్తి తెలంగాణ ప్రభుత్వానికి ఉంది అంటూ వ్యాఖ్యానించారు.  ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆసుపత్రిలో బెడ్లు ఆక్సిజన్ వెంటిలేటర్ల కొరత లేదు అంటూ స్పష్టం చేశారు. ప్రస్తుతం  వైరస్ వచ్చిన వారిలో 80 శాతం మందిలో లక్షణాలు ఉండటం లేదని  ఆయన వ్యాఖ్యానించారు అయితే ఇలా లక్షణాలు లేకపోయినప్పటికీ స్వల్ప లక్షణాలు ఉన్నప్పటికీ హోమ్ క్వారంటైన్ లో ఉంటూ  చికిత్స తీసుకోవాలని...  అలాంటివారు ఆసుపత్రులకు రావద్దు అంటూ ఆయన సూచించారు. మధ్యస్థ తీవ్ర లక్షణాలు ఉంటేనే ఆసుపత్రులకు వచ్చి చికిత్స తీసుకోవాలి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: