ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి అన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగ్గా.. తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగింది.  ఈ క్రమంలోనే రెండు ఉప ఎన్నికలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగాయి.  అయితే ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు అధికార పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిపోయాయి. ఎందుకంటే రెండు ఉప ఎన్నికల్లో కూడా అధికార పార్టీ సిట్టింగ్ స్థానాలు కావడం గమనార్హం.



 ఇకపోతే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు  అధికార పార్టీ ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదిపింది. ఈ క్రమంలోనే సైలెంట్ గా పలు రకాల వ్యూహాలను అమలు చేసిన అధికార పార్టీ  అత్యధిక మెజారిటీ సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇక తిరుపతి ఉప ఎన్నిక నిన్న ప్రతిష్టాత్మకంగా జరిగాయి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరిగింది. అయితే తిరుపతి ఉప ఎన్నిక తో పోలిస్తే అటు తెలంగాణలో జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనే కేసీఆర్ పంత నెగ్గింది అని అర్థమవుతుంది.



 ఎందుకంటే గత ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరిగిన సమయంలో తిరుపతి పార్లమెంటు స్థానంలో ఏకంగా 80%  పోలింగ్ నమోదయింది.ఈ క్రమంలోనే అధికార వైసిపి పార్టీ భారీ మెజారిటీ సాధించి విజయం సాధించింది. ఏకంగా రెండు లక్షలకు పైచిలుకు మెజారిటీ తో విజయం సాధించింది కానీ ఈ సారి మాత్రం కేవలం 64.29 శాతం మాత్రమే పోలింగ్ నమోదయింది. అయితే ఈ సారి తప్పనిసరిగా పోలింగ్ శాతాన్ని పెంచి ఐదు లక్షల వరకు మెజారిటీ సాధించాలని అనుకున్నా అధికార పార్టీ ఆ విషయంలో మాత్రం పంత నెగ్గించుకోలేకపోయింది. అయితే అటు నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మాత్రం గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 86%శాతం...  ప్రస్తుత ఉప ఎన్నికల్లో 88 % పోలింగ్ నమోదు అయ్యింది దీన్ని బట్టి చూస్తే అటు జగన్ కంటే కేసిఆర్ తన పంత నెగ్గించుకున్నారు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: