కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకి కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. గత ఏడాది ఇదే సమయంలో కరోనా కేసుల సంఖ్య దారుణంగా పెరిగిపోయింది. ప్రజలందరూ బెంబేలెత్తిపోయారు.  కరోనా వైరస్ పై అవగాహన లేకపోవడంతో ఎక్కడ ప్రాణం పోతుందేమో అని అరచేతిలో ప్రాణాలను పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకును వెళ్లదీసారూ. ఇక వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు గత ఏడాది ఇదే సమయం లో లాక్ డౌన్ కొనసాగింది. మొన్నటి వరకు తక్కువగా ఉన్న కరోనా వైరస్ కేసుల సంఖ్య మరోసారి భారీగా పెరిగిపోయింది.



 గత ఏడాది ఇదే సమయంలో దారుణంగా కరోనా వైరస్ కేసులు వెలుగు లోకి వచ్చాయి అనుకుంటే ప్రస్తుతం అంతకుమించి అనే రేంజ్ లో కరోనా వైరస్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.  అయితే గత ఏడాది లాగానే ప్రస్తుతం మరింత దుర్భర పరిస్థితులు వస్తున్నట్లు తెలుస్తోంది.  వైరస్ బారినపడి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థలం కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ఇక సామూహిక దహనం చేసేందుకు కూడా కొంతమంది అధికారులు సిద్ధమవుతున్నారు.  ఇక కొంతమంది కుటుంబీకులకు కరోనా వైరస్ బారినపడి ప్రియమైన వారు చనిపోతే కడచూపు కూడా దక్కని దుస్థితి ఏర్పడుతుంది.


 అయితే కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం దేశం మొత్తం అల్లకల్లోలం అవుతూ ఉండగా ప్రతి రోజూ వేలాది మంది వైరస్ బారినపడి బలి అవుతూనే ఉన్నారు. ఇక రోజు రోజుకు కరోనా వైరస్ రోగుల సంఖ్య పెరిగి పోతూ ఉండడంతో ఆసుపత్రుల్లో బెడ్ లు దొరకక ప్రాణవాయువు అందక చివరికి పిట్టల్లా రాలిపోతున్నారు మనుషులు.  రోజు రోజుకు అత్యంత ఘోరంగా మారిపోతుంది పరిస్థితి. కరోనా మృతుల సంఖ్య పెరిగి పోతుండటంతో కొన్ని రాష్ట్రాలలో అంత్యక్రియలకు స్మశాన వాటికలు చాలడం లేదు. దీంతో సామూహిక ఖననం చేస్తున్నారు. అదే సమయంలో ఇక ఆంబులెన్స్ లో నే అంత్యక్రియలకు సంబంధించిన తంతు పూర్తి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: