ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. గత ఏడాది వెలుగులోకి వచ్చిన వైరస్ భారత్లోకి కూడా పాకిపోయి ఎంతో మందిని బలితీసుకుంది. శరవేగంగా వ్యాప్తిచెంది ఎంతో మందిలో ప్రాణాభయాన్ని కలిగించింది.  అయితే అయితే కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజయవంతమయ్యాయని కరోనా వైరస్ కేసుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది అని దేశ ప్రజానీకం మొత్తం ప్రస్తుతం కాస్త ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరో సారి కరోనా వైరస్ కేసుల సంఖ్య ఊహించని విధంగా భారీగా పెరిగిపోవడం అందర్నీ ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది కంటే ఎక్కువగా ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది.



  ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా పంజా విసురుతున్న ఈ మహమ్మారి వైరస్ ఇంకా ఎంతో మందిని ఆస్పత్రిల పాలు చేస్తుంది. అయితే అదే సమయంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది అనే విషయం తెలిసిందే .  అయితే ప్రస్తుతం దేశ జనాభా 130 కోట్లు ఉండగా వ్యాక్సిన్లు అంత పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయడం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగానే మారిపోయింది. ఈ క్రమంలోనే అందరికీ కాకుండా కేవలం అత్యవసరమైన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందించాలి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.



 అయితే వ్యాక్సిన్ వినియోగంపై ఇటీవలే ఏయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ చికిత్సలో వాడే రేమిడిసివర్ ను అనవసరంగా వినియోగించ వద్దు అంటూ ఆయన సూచించారు. కరోనా వైరస్ బారిన పడిన రోగులలో పరిస్థితి విషమించి ఆక్సిజన్ స్థాయి తక్కువై ఆసుపత్రిలో చేరిన వారికి మాత్రమే వాడాలి అని సూచించారు. స్వల్ప లక్షణాలు ఉన్న వ్యక్తులు వైద్యులను సంప్రదించకుండా సొంతంగా రేమిడిసివర్ వాడ వద్దు అంటూ తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉన్నవారు రేమిడిసివర్ వాడితే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి అంటూ సూచించారు. రేమిడిసివర్ కేవలం ఆసుపత్రిలో ఆరోగ్యం విషమించి చేరిన రోగులకు మాత్రమే ఉపయోగించాలి అంటూ చెప్పుకొచ్చారు ఏయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా.

మరింత సమాచారం తెలుసుకోండి: