తిరుపతి లోక్‌స‌భ ఉప ఎన్నిక సందర్భంగా వందలాది మంది వ్యక్తులు దొంగ ఓట్లు వేయడానికి వచ్చి కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు. దాదాపు అన్ని చానల్స్ లో లైవ్లో ప్రసారమైన ఈ తంతువ‌ల్ల ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి ప‌రువు పోయిందా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప‌రువు పోయిందా? అనే విష‌యం ఇప్పుడు ఏపీలో చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. పోలీసులు చేయవలసిన పనులు టీవీ ఛాన‌ల్స్ చేశాయి. దొంగ వేటు వేయడానికి వచ్చిన వారిని మీడియా వారే గుర్తించి వారి దగ్గర కెమెరా పెట్టి తండ్రి పేరు ఏంటి, మీ చిరునామా ఎక్క‌డ‌? లాంటి ప్రశ్నలు వేస్తే.. వారంతా సమాధానాలు చెప్పడానికి తడబడ్డారు.

ఎందుకు త‌డ‌బ‌డ్డారు?
తండ్రి పేరు చెప్పడానికి తడబడి, కార్డులోలో ఉంది చూసుకో అని మీడియా రిపోర్టర్ తో చెప్పినవారు కొందరైతే, సమాధానాలు చెప్పలేక అక్కడి నుంచి గబగబా నిష్క్రమించినవారు మరికొందరున్నారు. మరొక ప్రాంతంలో ప్రైవేటు వాహనంలో ఉన్న స్త్రీలు తాము వేరే ఊరి నుంచి ఓటు వేయడానికి తిరుపతికి వచ్చామని మీడియాతో నేరుగా చెప్పారు. సంక్షేమ ప‌థ‌కాలు తమను గెలిపించి తీరుతాయని బలంగా వాదిస్తూ వచ్చిన అధికార వైఎస్ఆర్సీసీ ఈ స్థాయిలో జనాలను తరలించడం, అక్రమాలకు తెర‌లేప‌డం తటస్థ‌ ఓటర్లను సైతం విస్మయపరిచింది. ఇప్పటికే వీటిపై ఎలక్షన్ కమిషనర్కి ఫిర్యాదులు వెళ్లాయి.

గెలుస్తామ‌నే న‌మ్మ‌కం లేక‌నే ఇలా చేశారు!
జగన్ కి తన పాలన మీద నమ్మకంలేకే ఈ విధమైన అక్రమాల కు పాల్పడ్డారని బి.జెెెె.పి అభ్యర్థి రత్నప్రభ ఆరోపించారు.  తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రశాంతంగాా జరిగితే.. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికలో మాత్రం ఈ స్థాయి ఆరోపణలు వీడియో సాక్ష్యాలతో స‌హా బయటకి రావడంపై కెసిఆర్ తో పోలిస్తే జగన్ ఎంత పిరికితనం తో వ్యవహరిస్తున్న్నాడో నిరూపిస్తోందంటూ నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. దొంగ ఓట్ల వ్య‌వ‌హారం వైసీపీకి, జ‌గ‌న్‌కే కాకుండా  రాష్ట్రానికి కూడా త‌ల‌వంపులు తెచ్చింద‌ని ప్ర‌జాస్వామ్య‌వాదులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: