ఆంధ్రప్రదేశ్ లో కొన్ని సామాజిక వర్గాలు అధికార వైసీపీకి దూరం అవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని విషయాలలో అధికార పార్టీ నేతలు చేస్తున్న తప్పులు కారణంగా ఇప్పుడు కొంతమంది దూరమవుతున్నారు అనే భావన చాలా వరకు కూడా వ్యక్తమవుతుంది. రాజకీయంగా తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడంతో కొన్ని సామాజిక వర్గాలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం అధికార పార్టీకి దూరమయ్యే అవకాశాలు ఉండవచ్చు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. వాస్తవానికి కృష్ణ, గుంటూరు, అనంతపురం, గోదావరి జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారిని ఎక్కువగా టార్గెట్ చేయడం, వారి వ్యాపారాలను కూడా ఎక్కువగా ఇబ్బంది పెట్టడంతో కమ్మ సామాజిక వర్గం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా టార్గెట్ చేసే అవకాశాలు ఉండవచ్చు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. వాస్తవానికి ఈ కమ్మ సామాజిక వర్గం లో కాస్త పలుకుబడి ఉన్న వాళ్ళు ఎక్కువ అంతేకాకుండా ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్లు కూడా ఎక్కువగానే ఉంటు ఉంటారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికార పార్టీని ఓడించాలనే లక్ష్యంతో కమ్మ సామాజిక వర్గం నేతలు ఆర్థికంగా కూడా కష్ట పడే అవకాశాలు కూడా ఉన్నాయి.

కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది అనే భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే కమ్మ సామాజిక వర్గం లో కొంతమంది రాష్ట్ర ప్రభుత్వానికి భయపడి ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు అని అంటున్నారు. కొంతమంది తెలంగాణ కూడా వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తే ఇతర సామాజిక వర్గాల్లో కూడా ఒక రకమైన ఆందోళన ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: