తెలంగాణలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ విజయానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పరోక్షంగా సహకరించారు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యక్షంగా కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి అనే అంశాన్ని బహిరంగంగా చెప్పారు. అయితే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ విషయంలో భారతీయ జనతా పార్టీ దూకుడుగా వెళ్తున్నది. కాబట్టి జనసేన పార్టీ తెలంగాణలో తెరాస తో కలిసి వెళ్తుందని కొందరు ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు.

ఖమ్మం, నల్గొండ అంతేకాకుండా వరంగల్ జిల్లాలలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా ఉన్నారు. హైదరాబాదులో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా ఉన్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ వెళ్లే వాళ్ళు... ఆంధ్ర ప్రాంతం నుంచి ఖమ్మం నల్గొండ ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడిన వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ను తక్కువ అంచనా వేయకుండా ఉండడం మంచిదని అంటున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కనీసం 60 నియోజకవర్గాల్లో అయినా గెలిచే అవకాశాలు ఉండేవి. జనసేన పార్టీ లేకపోతే కచ్చితంగా కాపు సామాజిక వర్గం అండగా నిలబడే అవకాశాలు కూడా ఉన్నాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితులు  తెలంగాణలో ఆసక్తికరంగా మారుతున్నాయి. భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని సూచిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటికే అలర్ట్ అవుతున్నారు. అయితే జనసేన పార్టీని బిజెపి కలుపుకొని వెళ్లకపోతే మాత్రం టిఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరే అవకాశం ఉండవచ్చు. తెలంగాణలో జనసేన పార్టీ సొంతంగా పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికి షర్మిల కూడా తెలంగాణలో అడుగు పెట్టారు. కాబట్టి జనసేన పార్టీ కూడా సొంతంగా పోటీ చేస్తే వ్యతిరేక ఓటు బ్యాంకు ఆ పార్టీ వైపు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిపక్షంగా బీజేపీ ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: