తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బయటకు వెళ్లిపోయారు. దీనితో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాస్త కంగారు పడుతున్నారని కొందరు అంటున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు కాస్త ఆందోళనకరంగా మారడంతో ఏ విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తారు ఏంటనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే ఆలోచనలో ఉన్నారని ప్రచారం ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన కొంతమంది నేతలు తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల కొంతమంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారని టాక్. వాళ్ళు ఇతర పార్టీలలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోకి వస్తే వాళ్లకు మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు అని అంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఒకరు తిరిగి తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి బాగానే ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కాస్త జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. పార్టీలోకి వస్తే నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగిస్తానని కూడా చెప్పారట. భవిష్యత్తులో జనసేన, భారతీయ జనతా పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్లే అవకాశం ఉందని చెప్పారట.

కాబట్టి బలమైన నేతలు ఎవరైనా నియోజకవర్గాల్లో పార్టీ లోకి వస్తే వాళ్లను వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేసే విధంగా తన నుంచి ప్రోత్సాహం ఉంటుంది అని...  కచ్చితంగా సీటు ఇస్తానని చంద్రబాబు నాయుడు స్వయంగా చెబుతున్నారట. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడక పోయినా సరే నీకు ఎటువంటి ఇబ్బంది లేదు నేను చూసుకుంటాను అని కొంతమందికి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడంతో ఇప్పుడు వాళ్లు కూడా పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో ఏం జరుగుతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: