ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన విషయంలో చాలా వరకు దృష్టిసారించిన సరే కొన్ని కొన్ని అంశాల్లో మాత్రం జగన్ దృష్టి పెట్టడంలేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని అంశాలను చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయక పోవడంతో ఎమ్మెల్యేలు కూడా ఇబ్బందులు పడుతున్నారనే అభిప్రాయం ఉంది. తిరుపతి పార్లమెంటు విషయంలో కొంత మంది ఎమ్మెల్యేలు ఎప్పటి నుంచొ ఇబ్బందులు పడుతున్నారు. సీటు కోసం ఎదురు చూసిన వాళ్లు కూడా చాలామంది ఉన్నారు.

అంతే కాకుండా వర్గ విభేదాలు కూడా తిరుపతి పార్లమెంటు పరిధిలో ఎక్కువగానే ఉన్న సంగతి తెలిసిందే. దీనివలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై కూడా విమర్శలు తీవ్రస్థాయిలోనే వస్తున్నాయి. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని అంశాలు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తిరుపతి పార్లమెంటు పరిధిలో వైసీపీ గెలిచిన మెజార్టీ రాకపోవచ్చని అంటున్నారు. ప్రధానంగా ఐదు నియోజకవర్గాల్లో తిరుపతి పార్లమెంటు పరిధిలో ఇబ్బందికరంగా పరిస్థితి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. చాలామంది నాయకులు సమర్థవంతంగా పని చేయకపోవడంతో ఇప్పుడు తిరుపతి పార్లమెంటు పరిధిలో భారీ మెజారిటీ వచ్చే అవకాశం లేదు అనే అంశాన్ని ముఖ్యమంత్రి వద్దకు తీసుకువచ్చినట్టు సమాచారం.

మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ భారీ మెజారిటీతో గెలవకపోయినా తెలుగుదేశం పార్టీ గట్టిపోటీ ఇచ్చిన సరే ఖచ్చితంగా అధికార పార్టీ నేతలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది. కాబట్టి అధికార పార్టీ బలంగా ఉంది.  కొన్ని కొన్ని అంశాలలో అధికార పార్టీకి ప్రతికూలంగా మారినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి భవిష్యత్తులో ఏ విధంగా పరిస్థితులు ఉంటాయి అనేది చూడాలి. మరి ఈ అంశాన్ని సీఎం జగన్ ఎంత వరకు సరిదిద్దుతారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: