తిరుపతి ఉప ఎన్నికలు ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎన్నికలు జరిగాయి.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చిన కూడా రాజకీయ నేతలు ఉపయోగించుకోలేదు. రసాభాసగా ఎన్నికలు ముగిశాయి. టీడీపీ వర్సెస్ వైసీపీ అన్న విధంగా ఎన్నికలు పూర్తి అయ్యింది. దొంగ ఓట్ల కలకలం రేపుతోంది. ఈ విషయం పై రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. గతంలో నమోదు అయిన ఎన్నికల తో పోలిస్తే ఈ ఏడాది నమోదు అయిన పోలింగ్ శాతం కూడా తక్కువే అని అధికారులు వెల్లడించారు. గట్టి పోటీ మద్య సాగిన ఎన్నికలు అయిన కూడా పోలింగ్ తక్కువ నమోదు కావడం గమనార్హం...

ఈ ఎన్నికల్లో హైలెట్ అయిన విషయం దొంగ ఓట్లు.. 
రెండు లక్షల కు పైగా నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు చలామణిలో ఉన్నాయని తాము ముందు నుంచి చెబుతున్నదే వాస్తవమని పోలింగ్‌ రోజు రుజువైందని తెదేపా పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ వెల్లడించారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల తో శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వారు సమావేశమయ్యారు. ఆ తర్వాత విలేకరుల తో మాట్లాడుతూ పోలీసులు, ఎన్నికల అధికారులు వైకాపాకు అనుకూలంగా పని చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. 


తమ ఓట్లు వేరే వాళ్లు వేసేశారని ఓటర్లు, పోలింగ్‌ ఏజెంట్లూ కూడా చెబుతున్నా... ప్రిసైడింగ్‌ అధికారులకు, పోలీసులకు సిగ్గనిపించ లేదా...' అని ప్రశ్నించారు. అంతేకాదు ఇక్కడ జరిగిన పోలింగ్ ను రద్దు చేసి, రీ పోలింగ్ నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నారు.. కాగా, నిన్నటి పోలింగ్ బ్యాలెట్ బాక్సుల ను కట్టు దిడ్డమైన భద్రతా చర్యలు నడుమ భద్రపరిచారు.. మే 2 ను ఫలితాల ను వెల్లడించనున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీ గెలుపు ఖాయమని సదరు టీడీపీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రజలు ఎవరికీ పట్టం కడతారో తెలియాల్సి ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: