ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలు చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనే భావన చాలావరకు వ్యక్తమవుతుంది. కొన్ని కొన్ని అంశాల్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. కొంత మంది ఎమ్మెల్యేలు ఈ మధ్య కాలంలో అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ నేతలపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు దర్యాప్తు కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ దాడులు మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్ వద్ద ఉన్న పలుకుబడితో తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు అనే భావన కూడా వ్యక్తమవుతుంది.  భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను ఎక్కువగా టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సీఎం కేసీఆర్ ను కూడా తెలంగాణలో ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి జగన్ ను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండవచ్చనే అభిప్రాయం ఉంది. కాబట్టి ఎమ్మెల్యేలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కొన్ని కొన్ని అవినీతి కార్యక్రమాలకు దూరంగా ఉండడమే మంచిది అని అంటున్నారు.

భవిష్యత్ పరిణామాలను కొంతమంది తక్కువగా అంచనా వేస్తున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారతీయ జనతా పార్టీ సంగతి తెలియని చాలా మంది ఎమ్మెల్యేలు ఈ మధ్యకాలంలో కర్ణాటకలో కూడా వ్యాపారం మొదలు పెట్టారని ఇతర రాష్ట్రాలలో వ్యాపారాలు వద్దని ముఖ్యమంత్రి జగన్ చెప్పిన సరే కొంతమంది వినడం లేదని అంటున్నారు. దీనివలన ముఖ్యమంత్రి జగన్ కు కూడా సమస్యలు పెరుగుతున్నాయి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొన్ని అంశాలలో తెలంగాణలో గతంలో తెలుగుదేశం పార్టీ ఎక్కువగా ఇబ్బంది పడింది. ఇప్పుడు ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా వైసీపీ ఎమ్మెల్యేలకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: