తెలంగాణలో ఎమ్మెల్యేలు పనితీరు విషయంలో ఈ మధ్యకాలంలో సీఎం కేసీఆర్ ని ఇబ్బంది పెడుతున్నారనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో ఉండకపోవడంతో సీఎం కేసీఆర్ కూడా ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఉన్న కారణాలను సీఎం కేసీఆర్ ఈ మధ్యకాలంలో సీరియస్ గా తీసుకున్నారు. అయితే కొన్ని అంశాలలో సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న వ్యవహారశైలి కూడా ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతోందని టాక్. తమ నియోజకవర్గాలకు సీఎం కేసీఆర్ నిధులు ఇవ్వడం లేదనే భావన వ్యక్తమవుతోంది.

అభివృద్ధి జరిగిన నియోజకవర్గాల్లోని మళ్లీమళ్లీ అభివృద్ధి చేస్తున్నారు అని దీని వలన సమస్యలు ఎక్కువగా పెరుగుతున్నాయని టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీలలో  కూడా ఆగ్రహం   అనేది ఎక్కువగా పెరుగుతుంది. కొంత మంది ఎమ్మెల్సీలు కూడా ఇప్పుడు సీఎం కేసీఆర్ వద్ద గట్టిగా మాట్లాడి తమతమ ప్రాంతాలకు నిధులు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని అంటున్నారు. కొంతమంది మంత్రులు సీఎం కేసీఆర్ వద్ద బలంగా ఉండటంతో వాళ్ళ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకుంటున్నారని అన్నటున్నారు.

కానీ ఇప్పుడు కొంత మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. నియోజకవర్గాల ఇన్చార్జిలు విషయంలో కూడా సీఎం కేసీఆర్ పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో సమస్యల తీవ్రత పెరిగి పోతుంది అనే భావన కూడా ఉంది. రాజకీయంగా ఉన్న అంశాలను సీఎం కేసీఆర్ చాలా సీరియస్గా తీసుకోవాలని లేనిపక్షంలో సమస్యలు పెరిగే అవకాశాలు ఉండటమే కాకుండా ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయినా సరే ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు అని కొంతమంది వ్యాఖ్యనిస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడు భారతీయ జనతాపార్టీ కూడా ఎక్కువగా ఫోకస్ పెడుతుంది.  కాబట్టి ఎమ్మెల్యేలకు అన్యాయం చేయకుండా సీఎం కేసీఆర్ ముందుకు వెళ్లడం మంచిది అనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి భవిష్యత్ పరిణామాలను సీఎం కేసీఆర్ ఏవిధంగా ఎదుర్కొంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: