మాములుగా ఎన్నికలు ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా వాటిపై సర్వేలు జరగడం చూస్తూ ఉంటాము. ఈ సర్వేలు రెండు రకాలుగా ఉంటాయి. ఎన్నికలకు ముందు జరిగే వాటిని ప్రీ పోల్ సర్వే అని, ఎన్నికల తరువాత జరిగే వాటిని ఎగ్జిట్ పోల్ సర్వే అని పిలుస్తారు. నిన్ననే ఏపీలోని తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక ముగిసింది. వివిధ వివాదాలతో ఎట్టకేలకు తిరుప్తి ఉప ఎనిక పూర్తయిపోయింది. దీనితో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు గెలుపు అవకాశాల మీద లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఒక సర్వే సంస్థ ఈ ఎన్నికల మీద కీలక విషయాలను బయటపెట్టింది. మరి ఈ ఎన్నికల్లో ఏవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము.

తాజాగా న్యూ ఆంధ్ర సర్వే కొన్ని విషయాలను తెలిపింది. గతంలో కూడా వీరిచ్చిన సర్వేలు దాదాపుగా దగ్గరగా ఉన్నాయి. దీని కారణంగా ఇప్పుడు వీరి సర్వేపై అందరి దృష్టి నెలకొంది. ఈ తిరుపతి ఎన్నికలపై వీరి అంచనాలు చూస్తే...భారతీయ జనతా పార్టీ మరియు జనసేన కూటమి అభ్యర్థి రత్నప్రభ గారికి ఈ ఎన్నికలో 80 వేల ఓట్ల నుండి 90 వేల వరకు వస్తాయని తెలిపారు. ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న పనబాక లక్ష్మి గారికి 2,85 ,000  ఓట్ల నుండి 3 లక్షల ఓట్ల వరకు వచ్చే అవకాశముందని తెలిపారు. మరియు కాంగ్రెస్ అభ్యర్థి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి చింతామోహన్ గారికి 15 వేల నుండి 20 వేల ఓట్ల వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు.

ఇకపోతే ఏపీ అధికార పార్టీ వైసీపీ అభ్యర్థి గురుమూర్తి గారికి 8 లక్షల నుండి 8 లక్షల 30 వేల ఓట్లు వచ్చే అవకాశముందని న్యూ ఆంధ్ర సర్వే అంచనాలను బయటపెట్టింది. ఇవి పోలింగు అయిన తరువాత అంచనాలు. అదే విధంగా వీళ్ళు ప్రీ పోల్ సర్వే కూడా చేయడం జరిగింది. ఇందులో బీజేపీ జనసేన అభ్యర్థి రత్నప్రభ గారికి 4-5 శాతం ఓట్లు వస్తాయని....టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 15 నుండి 18 శాతం ఓట్లు వస్తాయని చెప్పారు. మరియు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతా మోహన్ గారికి  1 నుండి  1.5 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.  ఇక వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి 30 నుండి 39  శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. మరియు నోటాకు 1-1.6 శాతం ఓట్లు వస్తాయని సర్వే ద్వారా తెలిపారు.  ఇవి కేవలం అంచనాలు మాత్రమే వస్తావా ఫలితాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే...

మరింత సమాచారం తెలుసుకోండి: