కరోనా పంజాతో  తెలంగాణలో విద్యాసంస్థలను మూసివేసినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కొనసాగిస్తున్నారు. దీంతో స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్ కరోనా హాట్ స్పాట్లుగా మారిపోతున్నాయి. కర్నూల్ జిల్లా ఆదోని కస్తూర్బా గాంధీ హాస్టల్‌లో కరోనా కలకలం చెలరేగింది. 52 మంది విద్యార్థినీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. కొవిడ్ పాజిటివ్ వచ్చిన విద్యార్థినులను వైద్య అధికారులు ఐసోలేషన్‌కు తరలించారు. పాఠశాల సముదాయంలోనే ఓ గదిలో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నారు. ఏపీలో విద్యాసంస్థల్లోనూ కరోనా వ్యాప్తి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

కరోనా సెకండ్ విజృంభిస్తున్నా స్కూళ్లు, కాలేజీలు కొనసాగిస్తుండటంపై  విమర్శలు వస్తున్నాయి. కరోనా తీవ్రతతో అద్యాపకులు వణికిపోతున్నారు. స్కూళ్లు, కాలేజీలను మూసివేయాలని ఉపాద్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేయటం లేదా వాయిదా వేయాలని కోరారు. వేచి చూసే ధోరణి కంటే విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వటం ఉత్తమమన్నారు. టీకా పంపిణీ రేటు ఘోరంగా ఉన్న సమయంలో.. విద్యార్థుల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టడం తగదన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న అనిశ్చితి, ఆందోళన, ఒత్తిడిని నివారించడానికి పరీక్షలు రద్దు చేయటమే ఉత్తమమని అన్నారు. ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ లేకపోవడం, వెంటిలేటర్ల కొరత అధికంగా ఉందని సీఎం జగన్ కు రాసిన లేఖలో లోకేష్ తెలిపారు.

ఏపీ విద్యాశాఖ అధికారులు కూడా విద్యాసంస్థలను మూసివేయాలని ప్రభుత్వానికి సూచించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తరహాలోనే పదో తరగతి, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేసే యోచనలో ఏపీ సర్కార్ ఉందని తెలుస్తోంది. ఇంటర్ సెకండియర్ పరీక్షలను మాత్రం వాయిదా వేయాలని నిర్ణయించారట. దీనిపై ఏక్షణమైనా ప్రభుత్వం నుంచి ప్రకటన రావచ్చుంటున్నారు. ప్రస్తుతం ఏపీలో కరోనా
విలయ తాండవం చేస్తోంది. గత వారం రోజులుగా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి


మరింత సమాచారం తెలుసుకోండి: