తెలంగాణాలో కరోనా కేసులు ఆగడం లేదు. రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం కనపడటం లేదు. కరోనా కేసుల కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కరోనా తీవ్రత తగ్గడం లేదు. రోజు రోజుకి వందల్లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ విషయంలో తెలంగాణా సర్కార్ ఇబ్బంది పడుతుంది. అయితే కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్ట్ చాలా ఆగ్రహంగా ఉంది. ఈ విషయంలో విచారణ జరిగిన ప్రతీసారి కూడా రాష్ట్ర సర్కార్ టార్గెట్ గా హైకోర్ట్ విమర్శలు చేస్తుంది.

48 గంటల్లో లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని స్పష్టం చేసింది. లేదంటే తామే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని చీఫ్ జస్టీస్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో  నమోదైన కేసులు వార్డుల వారిగా కోర్టుకు సమర్పించాలన్న హైకోర్టు.. ఆర్ టి పి సి ఆర్ రిపోర్టు 24 గంటల్లో వచ్చేలా చూడాలి  అని రాష్ట్ర సర్కార్ కి ఆదేశాలు ఇచ్చింది. హాస్పిటల్స్ లలో సలహాలు ఇవ్వడానికి నోడల్ అధికారి ని ఎవ్వరినైన నియమించాలీ అని ఈ సందర్భంగా స్పష్టంగా పేర్కొంది. Health.telangana.gov.in  వెబ్ సైట్ లో కోవిడ్ వివరాలు నమోదు చేయాలి అని విచారణ సందర్భంగా స్పష్టం చేసింది.

పెళ్లిళ్లు, శుభకార్యాలలో పబ్లిక్ ప్లేస్ లలో ఎక్కువ మంది గాదర్ ఐతే వారి పై చర్యలు   తీసుకోవాలి అని హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. డిజీపీ, ఆరోగ్య శాఖ ఆధికారులు ఇచ్చిన నివేదిక సరిగా లేదు అని అసహనం వ్యక్తం చేసింది.  మరోసారి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పూర్తి నివేదిక సమర్పించాలి అని హైకోర్ట్ పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 23 కు వాయిదా వేసిన హైకోర్టు... జాగ్రత్తగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: