తెలంగాణలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది మొన్నటి వరకు కేవలం వందల సంఖ్యలో ఉన్న కేసులు ప్రస్తుతం వేల సంఖ్యలో కి మారిపోయాయి. దీంతో తెలంగాణ ప్రజానీకం మరోసారి ఆందోళనలో మునిగిపోతుంది. అటు వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ వ్యాపిస్తుంది.  కరోనా వైరస్ సెకండ్ వేవ్ మరింత ప్రమాదకారిగా మారిపోయింది. ఈ క్రమంలోనే సామాన్య ప్రజలను అధికారులు ప్రజాప్రతినిధులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరిపై పంజా విసురుతుంది ఈ మహమ్మారి వైరస్.


 దీంతో ప్రజలు అందరూ బెంబేలెత్తి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఎంతో మంది కరోనా వైరస్ బారినపడి తీవ్ర లక్షణాలతో ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంతో ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో  ప్రైవేట్ ఆస్పత్రిలో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నట్లు సామాన్య ప్రజలు లబోదిబోమంటున్న ఘటనలు కూడా తెరమీదకు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలోనే  సామాన్య ప్రజలందరూ కరోనా వైరస్ చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి వెళ్లాలి అని అక్కడ మెరుగైన వైద్య సదుపాయాన్ని కల్పిస్తున్నామని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా కరోనా వైరస్ చికిత్సను గాంధీ ఆస్పత్రిలో అందిస్తున్నాము అంటూ రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు చెప్పుకొచ్చింది.


 ఇకపోతే ఇటీవలే ఈ విషయంపైనే సరికొత్త డిమాండ్ తెరమీదికి తెస్తున్నారు నేటిజన్లు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇక సిద్దిపేటలోని ఆయన ఫాంహౌస్ లో ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే ఒకవేళ కేసీఆర్ ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరాల్సి వస్తే గాంధీ ఆసుపత్రికి వెళ్లాలి అంటూ కోరుతున్నారు నేటిజన్లు. ఎందుకంటే గాంధీ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని అందరు గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలని గతంలో కేసీఆర్ చెప్పారు కానీ వాస్తవంగా మాత్రం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇలాంటి నేపథ్యంలో కేసిఆర్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటే ఎంతో మందికి గాంధీ ఆసుపత్రి పై నమ్మకం ధైర్యం కూడా వస్తుంది అని చెబుతున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: