ప్రస్తుతం దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా వైరస్ వాళ్లు వీళ్లు అనే తేడా చూడకుండా అందరిపై పంజా విసురుతుంది ఇప్పటికే ఎంతో మంది సామాన్య ప్రజలు సినీ సెలబ్రిటీలు ప్రజాప్రతినిధులు అధికారులు కూడా కరోనా వైరస్ బారిన పడుతున్నారు. అయితే మునుపటి కంటే మరింత వేగంగా ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తు ఉండడం అందరిని ఆందోళన కలిగిస్తోంది. ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నా ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ మాత్రం పంజా విసురుతుంది.  ఎంతో మందిని బలి తీసుకుంటోంది.  దీంతో మొన్నటివరకు కరోనా వైరస్ కేసులు తగ్గాయని కాస్త ఉపశమనం పొందుతున్న దేశ ప్రజానీకం మొత్తం మళ్ళీ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.



 అయితే కరోనా వైరస్ ప్రభావం యువకులలో కంటే వృద్ధులు చిన్న పిల్లలోనే ఎక్కువగా ఉందని గతంలో పలు అధ్యయనాల్లో కూడా కీలక విషయాలు బయటపడ్డాయి.  ఈ క్రమంలోనే ప్రస్తుతం వృద్ధుల అందరూ కూడా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇంటిపట్టునే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ముఖ్యంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలపై కరోనా వైరస్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఇక ఈ మధ్య కాలంలో ఇలా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు కూడా కరోనా వైరస్ బారిన పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.



 అయితే పిల్లలు కరోనా వైరస్ బారిన పడకుండా రక్షించుకునేందుకు వారిలో రోగ నిరోధక శక్తిని పెంచడం ఒకటే దారి అని చెబుతున్నారు నిపుణులు. ఐదేళ్లలోపు పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచేందుకు నిమ్మజాతి పండ్లు క్యారెట్లు స్ట్రాబెర్రీ  ఆకుకూరలు పెరుగు వంటివి రోజు వారి ఆహారంలో అందించాలని సూచిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎంతో మంది చిన్నారులు మొబైల్ ఫోన్లకు అలవాటు పడిపోతున్నారు. తద్వారా ఎక్కువసేపు నిద్రపోవడం లేదు అలా అయితే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. ఫోన్ పక్కన పెట్టి 10 గంటల పాటు నిద్ర పోయేలా చూడాలి అంటూ సూచిస్తున్నారు. ఇక పిల్లలకు విటమిన్ డి పొందేందుకు రోజు పొద్దున్నే అరగంట పాటు లేలేత సూర్య రశ్మి లో ఉంచడం ఎంతో మంచిది అని చెబుతున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: