తెలంగాణ రాష్ట్రం లో కరోనా పరిస్థితులపై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. మరోసారి ప్రభుత్వం పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన హై కోర్ట్... 10 రోజుల క్రితం తాము ఆదేశాలు ఇస్తే ఇప్పటి వరకు అమలు చేయలేదు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ లో స్కూల్స్ మూసివేశం, మాత ర్యాలీ లు నిషేదించామని చెప్పిన ఏజీపై మండిపడింది. పెళ్లి ళ్లు,చావులు, పరసనల్ పార్టీ లు,ఎన్నికల ర్యాలీ పై ఎలాంటి ఆంక్షలు పెట్టారన్న హై కోర్ట్ ఇష్టానుసారంగా రాజకీయా ర్యాలీలు చేయడం ఏంటని హైకోర్ట్ అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు విచారణకు హెల్త్ సెక్రెటరీ హాజరు అయ్యారు.

కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని హెల్త్ సెక్రటరీ వివరించారు. దేశ రాజధాని ఢిల్లీ లో సైతం కరోనా కట్టడి చేయడం కోసం లాక్ డౌన్ పెట్టారు అని... తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడమ లేదన్న హైకోర్టు.. కనీసం వారతంరం ఆంక్షలు కూడా లేవు ఈ రాష్ట్రం లో అని మండిపడింది. మాల్స్, సినిమా హాల్స్ , పబ్ లు, క్లబుల్లో విచ్చలవిడిగా జనాలు తిరుగుతుంటే ప్రభత్వం ఏం చేస్తోందని హై కోర్ట్ ప్రశ్నించింది. ఎప్పటికప్పుడు పరిస్థితి మానిటర్ చేస్తున్నాం అని ఏజీ చెప్పారు.

మానిటర్ చేయడం తోనే ప్రభుత్వం ఆగింది..చర్యలు మాత్రం శూన్యమని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. కుంభమేళా లో పాల్గొన్న  చాలా మంది నగరానికి తిరిగి వస్తున్నారు వారి పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని నిలదీసింది. బార్ల్ , పబ్ లు, రెస్టారెంట్ లు, సినిమా థియేటర్లు , ర్యాలీ లు , మ్యారేజ్స్  ఆంక్షలు విధించాలని హైకోర్టు ఆదేశం ఇచ్చింది. రాష్ట్ర స్థాయి నుండి గ్రామీణ స్థాయి వరకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి నోడల్ ఆఫీసర్ ను నియమించాలి అని పేర్కొంది. ప్రయివేటు, ప్రభుత్వ ఆస్పత్రుల బెడ్స్ పై మానిటరీ చేసి రోగులను కాపాడాలి అని పేర్కొంది. 48 గంటల్లో కర్ఫ్యూ లేదా లాక్ డౌన్ గురించి ప్రభుత్వం ఎలాంటి   నిర్ణయం తీసుకోకుంటే మేమే ఆదేశాలు ఇస్తాం అని స్పష్టంగా పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: