అవినీతి నియంత్రణకు రాష్ట్రంలో బీహార్ తరహా మోడల్ ను జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయిన కొత్తల్లోనే బీహార్ లో అవినీతిని అరికట్టేందుకు గట్టిచర్యలు తీసుకున్నారు. లంచం తీసుకుంటు ఎవరైనా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా, అవినీతి ఆరోపణలపై ఎవరైనా ఆధారాలతో  పట్టుబడినా వంద రోజుల్లోనే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో నితీష్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఉద్యోగుల అవినీతి కత తేల్చటానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా జరిగాయి.

ఆరోపణలపై ఆధారాలతో సహా పట్టుబడినా, లేకపోతే రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినా వాళ్ళని సస్పెండ్ చేస్తారు. వెంటనే వాళ్లపై విచారణ మొదలైపోతుంది. విచారణలో వాళ్ళ అవినీతి నిరూపితమైతే వెంటన వాళ్ళకి శిక్షలు పడుతుంది. ఇదే సమయంలో వాళ్ళ ఆస్తిని ప్రభుత్వం జప్తుచేసేస్తుంది. ఈ పద్దతివల్ల బీహార్లో ఉద్యోగుల అవినీతి బాగా తగ్గిందనే చెప్పాలి. విచారణలో వాళ్ళ అవినీతి నిరూపితం కాకపోతే వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చేస్తారు.

ఇపుడు ఇదే పద్దతిని ఏపిలో కూడా జగన్ అమలు చేయటానికి రెడీ అయిపోయారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీఅయ్యాయి. అయితే ఇక్కడ అదనంగా పెట్టిన షరతు ఏమిటంటే నిబంధనలను అమలు చేయటంలో విఫలమైతే బాధ్యులపైన కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించింది. బాధ్యులంటే ఇక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంటు కానీ లేకపోతే దర్యాప్తు అధికారి కానీ అవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే ఎవరిమీదైనా దాడులు చేసేటపుడు స్పష్టమైన సాక్ష్యాధారాలను దగ్గరుంచుకునే దాడులు చేయాల్సి ఉంటుంది.

ఇప్పటివరకు అమల్లో ఉన్న పద్దతి ఏమిటంటే అవినీతిపై అరెస్టయిన ఉద్యోగులపై యాక్షన్ తీసుకునేందుకు కాలపరిమితి ఏమీలేదు. అందుకనే విచారణకు  సంవత్సరాలు పడుతోంది.  దీనివల్ల కేసు ఎంతకీ తెమలదు. అటు ఉద్యోగికి కూడా ఇబ్బందే. తాజా ఉత్తర్వుల కారణంగా  ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టినట్లయ్యింది. మరి తాజా ఉత్తర్వులు ఎంత ఎఫెక్టివ్ గా అమలవుతాయో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: