ఏపీలో ముగిసిన తిరుపతి ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ లు జరుగుతున్నాయి. మామూలుగా చూస్తే గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ నుంచి గెలిచిన బ‌ల్లి దుర్గా ప్ర‌సాద్‌కు 2.28 ల‌క్ష‌ల మెజార్టీ వ‌చ్చింది. ఈ ఎన్నిక జ‌రిగి రెండేళ్లు అవుతోంది. రెండేళ్ల‌కే ఇక్క‌డ ఉప ఎన్నిక రావ‌డం.. రాజ‌కీయంగా అనేక స‌మీక‌ర‌ణ‌లు చోటు చేసుకోవ‌డం జ‌రిగింది. గ‌త ఎన్నిక‌ల్లో విడి విడిగా పోటీ చేసిన జ‌న‌సేన - బీజేపీ ఈ ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకుని బ‌రిలోకి దిగాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ జ‌న‌సేన‌ పోటీ చేయ‌కుండా పొత్తులో భాగంగా బీఎస్పీకి తిరుప‌తి సీటును కేటాయించింది.

ఇప్పుడు కూడా జ‌న‌సేన పోటీకి దూరంగా త‌మ మిత్ర‌ప‌క్ష మైన బీజేపీకి సీటు కేటాయించింది. ఇక వైసీపీ నుంచి డాక్ట‌ర్ గురుమూర్తి, టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి, బీజేపీ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి ర‌త్న‌ప్ర‌భ పోటీలో ఉన్నారు. పోలింగ్ ముగిసింది. వైసీపీ విజయం ఇక్కడ ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ మెజారిటీ ఎంత అన్నదానిపైన టీడీపీ, వైసీపీ క్యాడర్ జోరుగా బెట్టింగ్ లకు దిగుతుంది.

గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన 2.28 ల‌క్ష‌ల‌ మెజారిటీ రాదని టీడీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారు. మూడు లక్షలకు పై చిలుకు మెజారిటీ సాధిస్తామని వైసీపీ నేతలు బెట్టింగ్ కు దిగుతున్నారు. ఇక బీజేపీకి ప‌డే ఓట్ల పైన కూడా బెట్టింగులు న‌డుస్తున్నాయి. కొంద‌రు 80 వేల ఓట్లు వ‌స్తాయ‌ని బెట్టింగ్ కాస్తుంటే.. మ‌రి కొంద‌రు మాత్రం 50 వేల ఓట్లు కూడా రావ‌ని బెట్టింగ్ కాస్తున్నారు. మ‌రి వీరిలో ఎవ‌రి అంచ‌నాలు నిజం అవుతాయో ?  ఎవ‌రు గెలుస్తారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: