తెలుగు వారి ఆత్మ‌గౌరవ నినాదంతో ఏర్ప‌డిన తెలుగు దేశం పార్టీ.. ప్ర‌స్తుతం ఒక సందిగ్ధ ప‌రిస్థితిలో ఉంది. వ‌రుస ఓట‌ములు.. ప్ర‌జ‌ల్లో స‌న్న‌గిల్లుతున్న పార్టీ హ‌వా .. వంటి కార‌ణాల‌తో పార్టీ నేత‌ల్లో నైరాశ్యం నెల‌కొంది. అయిన‌ప్ప‌టికీ.. టీడీపీ అధినేత చంద్ర బాబు ఒంట‌రి పోరు చేస్తున్నారన‌డంలో సందేహం లేదు. అయితే.. ఇప్ప‌టికీ.. చంద్ర‌బాబు ఇమేజే పార్టీకి కొండంత అండ‌గా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. త‌న సామాజిక వ‌ర్గంలో ఇప్ప‌టికీ.. చంద్ర‌బాబు లీడ‌ర్ అయితేనే ఏపీ బాగుప‌డుతుంద‌ని అంటున్నారు. అయితే..ఎవ‌రికైనా.. గెలుపు ఓట‌ములు స‌హ‌జం.. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు టీడీపీ ఒడిదుడుకుల ప్ర‌యాణం చేస్తున్న‌ప్ప‌టికీ.. అంతిమంగా విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని ఈ వ‌ర్గం భావిస్తోంది.

అభివృద్ధికి నిరంతరం పాటుప‌డే నాయ‌కుడిగా చంద్ర‌బాబు.. త‌న‌ను తాను మ‌లుచుకున్న తీరు న‌భూతో న‌భ‌విష్య‌తి. నిజానికి అభివృద్ధిని ఆకాంక్షించేవారు.. వెంట‌నే సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు మంగ‌ళం పాడ‌తారు. అయితే.. చంద్ర‌బాబు క‌త్తికి రెండు వైపులా ప‌దునే అన్న‌ట్టుగా ఆయ‌న ఒక‌వైపు అభివృద్ధిని.. మ‌రోవైపు ప్ర‌జాసంక్షేమాన్ని కూడా స‌మాంతరంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లారు. గ‌త పాల‌న‌.. ఇప్పుడు కూడా కొన‌సాగి ఉంటే.. నిజంగానే ఈ రెండేళ్ల‌లో ఏపీ దేశంలోనే ముందు వ‌రుస‌లో ఉండేద‌నే వారిలో .. పార్టీల‌కు అతీతంగా అనేక మంది ఉండ‌డం గ‌మ‌నార్హం. బాబును రాజ‌కీయంగా విమ‌ర్శించేవారు కూడా ఆయ‌న అభివృద్ధిని మెచ్చుకుంటారు.

నిరంత‌ర స్వాప్నికుడిగా కూడా చంద్ర‌బాబు త‌న‌దైన ముద్ర వేశారు. ఉమ్మ‌డి ఏపీలో ఆయ‌న వేసిన అడుగులు.. ముఖ్యంగా సైబ‌రాబాద్ వంటి మ‌హాన‌గ‌రాన్ని సృష్టించ‌డం వంటివి హైద‌రాబాద్‌ను ప్ర‌పంచ ప‌టంలో నిల‌బెట్టాయి. ఇక‌, ఏపీలోనూ అమ‌రావ ‌తి వంటి కీల‌క ప్రాజెక్టుకు రూపు దిద్ద‌డం ద్వారా ఆయ‌న త‌న స్వ‌ప్నాన్ని సాకారం చేసుకునేందుకు ప్ర‌య‌త్నించారు. అయితే.. ప్ర‌స్తుతం టీడీపీ అనేక స‌వాళ్లు ఎదుర్కొంటోంది. ఒక‌టి బ‌హిర్గ‌త స‌వాళ్లు కాగా.. రెండు అంత‌ర్గ‌త స‌వాళ్లు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా పార్టీలో అసంతృప్తులు పెరుగుతున్నాయి.

యువ నేత‌లు కూడా ముందుకు రాలేని ప‌రిస్థితిఉంది. అయిన‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు ఇమేజ్ మాత్రం ఎక్క‌డా ప‌డిపోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామ‌మే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ టీడీపీకి బ్ర‌హ్మాస్త్రంగా మారుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి చంద్ర‌బాబు.. త‌న ఇమేజ్ బిల్డ‌ప్‌.. త‌న మాట తీరు వంటివి.. పార్టీని బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్న తీరు ఫ‌లించాల‌ని కోరుకునేవారు పార్టీల‌కు అతీతంగా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: