న‌ల‌భై ఏళ్ల టీడీపీ ప్ర‌స్థానంలో ఇప్పుడు ఎదుర్కొంటున్న ఒక సంక‌ట‌స్థితి ఎప్పుడు ఎదురు కాలేదు. అనేక మంది నాయ‌కులు.. అనేక పార్టీల‌ను చూసిన టీడీపీ.. ఇప్పుడు అన్ని విధాలా ప్రాభ‌వం కోల్పోయే ప‌రిస్థితి ఏర్ప‌డిందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వు తున్నాయి. అయితే.. దీనికి సంబంధించి రెండు వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఒక‌టి పార్టీ సైద్ధాంతిక విధానాల‌ను అనుస‌రించ‌డం లేద‌ని.. అదే స‌మ‌యంలో విధాన‌ప‌ర‌మైన రాజ‌కీయాల‌ను చేయ‌డంలో లోపాలు ఉన్నాయ‌ని.. ప‌రిశీల‌కులు అంటున్నారు. ముఖ్యంగా చంద్ర‌బాబు విధానప‌ర‌మైన రాజ‌కీయాలు చేయ‌డం స‌రికాద‌ని సూచిస్తున్న వారు పెరుగుతున్నారు.

విధానాల‌ను ప‌క్క‌న పెట్టి.. సైద్ధాంతిక విధానాల‌ను అనుస‌రించ‌డ‌మే మ‌రీ ముఖ్య‌మ‌ని చెబుతున్నారు. విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం అంటే.. ఎన్నిక‌ల స‌మ‌యానికి ఏ పార్టీతో జ‌ట్టుక‌ట్టాలా?  ఏ నేత‌ను భుజానికి ఎత్తుకోవాలా? అని ఆలోచిస్తున్నార‌ని.. అయితే.. ఈ విధానం బెడిసి కొడుతోంద‌ని అంటున్నారు. ఇలా కాకుండా.. అన్న‌గారు ఎన్టీఆర్ అందుకున్న సైద్ధాంతిక విధానాల‌ను భుజాన వేసుకోవ‌డం మంచిద‌ని సూచిస్తున్నారు.

ప్ర‌స్తుతం జ‌గ‌న్ వంటి యువ నాయ‌కుడిని ఎదుర్కొనేందుకు.. యువ‌త‌కు ప్రాదాన్యం ఇవ్వ‌డం మరీ ముఖ్య‌మ‌ని అంటున్నారు. గ‌తంలో అన్న‌గారు యువ‌త‌కు ప్రాధాన్యం ఇచ్చిన కార‌ణంగా పార్టీ దూకుడుగా ముందుకు సాగింది. అదేవిధంగా మ‌హిళ‌ల‌ను ఆక‌ర్షించేందుకు కూడా పార్టీ సిద్ధాంతాల‌ను అనుస‌రించాల‌ని.. వారికి ఎక్కువ భాగ‌స్వామ్యం క‌ల్పించాల‌ని సూచ‌న‌లు వ‌స్తున్నాయి.

అదే స‌మ‌యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నామ‌ని చెబుతున్న‌ప్ప‌టికీ.. మ‌రింత మందికి అవ‌కాశం ఇవ్వ‌డం ద్వారా.. పార్టీని డెవ‌ల‌ప్ చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తంగా చూస్తే.. చంద్ర‌బాబు.. విధానప‌ర‌మైన రాజ‌కీయాలు కాకుండా.. సంస్థాగ‌త, వ్య‌వ‌స్థీకృత విధానాల‌ను అనుస‌రించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని చెబుతున్నారు. మ‌రి ఆ దిశ‌గా చంద్ర‌బాబు అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: