తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు సంఖ్య గత కొన్ని రోజుల నుంచి విపరీతంగా పెరిగిపోతుంది. అయితే మొన్నటి వరకు కేవలం వందల్లోనే ఉన్న కేసుల సంఖ్య చూస్తుండగానే వేల లోకి మారిపోయింది. అంతకంతకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు ఆందోళనలో మునిగిపోతున్నారు.  ప్రజలందరూ ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతూనే ఉన్నారు.  అయితే రోజురోజుకు వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగి పోతూ ఉండటం అంతే కాకుండా ఎంతో మంది ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రులకు వెళ్తుండటంతో ఆసుపత్రిలో గత ఏడాది లాగానే మళ్లీ బెడ్ ల కొరత ఏర్పడుతుంది అని ఎన్నో వార్తలు వైరల్ గా మారిపోతున్నాయి.



 రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక అన్ని ఆసుపత్రులలో కూడా బెడ్ల కొరత ఏర్పడిందని అంతేకాకుండా వెంటిలేటర్ల కొరత కూడా ఉంది అంటూ వార్తలు వైరల్ గా మారిపోవడం ఇక అందరిని మరింత ఆందోళన చెందెలా చేస్తుంది. తాజాగా దీనిపై తెలంగాణ వైద్య శాఖ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో కలిపి 30 వేల 35 కరోనా పడకలు ఖాళీగానే ఉన్నాయి అంటూ ఇటీవల తెలంగాణ వైద్య శాఖ క్లారిటీ ఇచ్చింది. వీటిలో ప్రభుత్వ ఆసుపత్రిలో 10 వేల 269 పడకలు ఖాళీగా ఉంటే ప్రైవేట్ ఆసుపత్రిలో 19766 కరోనా పడకలు ఖాళీగా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. బెడ్స్ కొరత ఏర్పడుతుంది అంటూ వస్తున్న వార్తలను నమ్మి ఎవరూ ఆందోళన చెందొద్దు అంటూ సూచించింది.



 అయితే బెడ్స్ కొరత ఏర్పడింది అంటూ వస్తున్న వార్తలతో ఆందోళన చెందుతున్న ప్రజానీకం వైద్యశాఖ క్లారిటీ ఇవ్వడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు . ఇకపోతే రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణపై ఆంక్షలు అమలులోకి తెస్తోంది. ఇప్పటికే ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలి అని భౌతిక దూరం పాటించాలి నిబంధన తెరమీదికి తెచ్చింది రాష్ట్రప్రభుత్వం అంతేకాకుండా మాస్క్ ధరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించింది ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రజలు బాధ్యతాయుతంగా మాస్కు ధరించి బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: