కరోనా ఏపీలో జోరుగా విస్తరిస్తోంది. రోజూ మళ్లీ వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి.. తాజాగా 38 మంది వరకూ ఒక్కరోజులోనే చనిపోయారు. అంతే కాదు.. కొన్ని జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు వస్తున్నాయి. అయితే.. మిగిలిన  జిల్లాల సంగతేమో కానీ.. నెల్లూరు జిల్లాలో మాత్రం పరిస్థితి భయంకరంగా ఉందంటున్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి.. నెల్లూరు జిల్లాలో నిన్న 3325 పరీక్షలు చేస్తే 1347 పాజిటివ్ కేసులు నమోదయ్యాయట.

అంటే... 40 శాతానికి పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రపంచంలోనే అరుదైన పరిస్థితి అంటున్నారు సోమిరెడ్డి. అందుకే వెంటనే నెల్లూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదకర పరిస్థితుల నుంచి నెల్లూరు జిల్లాను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 13 జిల్లాల కంటే ఎక్కువగా నెల్లూరులో కోవిడ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోందని.. బెడ్లు, ఆక్సిజన్లు, వెంటిలేటర్లు, రెమ్ డెసివర్ అవసరమైన మేర సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


కోవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు కళ్యాణ మండపాలను సిద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడిందంటున్న సోమిరెడ్డి.. ఆస్పత్రుల్లో కార్డియాలజీ, నెఫ్రాలజీ తదితర విభాగాల్లోని వెంటిలేటర్లను కూడా కోవిడ్ రోగుల కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నెల్లూరులో వెంటిలేటర్ సౌకర్యం లేక అనేక మంది చెన్నైకి వెళ్లి లక్షలకు లక్షలు ఖర్చు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను కాపాడే విషయంలో ఎలాంటి ఆలస్యం చేయవద్దని చేతులెత్తి వేడుకుంటున్నానంటున్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

నెల్లూరులో కరోనా కల్లోల పరిస్థితులపై సీఎం  జగన్మోహన్ రెడ్డికి తాను లేఖ రాయగానే స్పందించిన హెల్త్ మినిస్టర్ ధన్యవాదాలంటున్న మాజీ మంత్రి reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తగిన చర్యలు తీసుకుని నెల్లూరు జిల్లాను కాపాడాలంటున్నారు. మరి నిజంగానే నెల్లూరు జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిందే.. తప్పదు మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: