దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైన కరోనా రోగులకు ఉపయోగించే ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని లిక్విడ్‌ ఆక్సిజన్‌ ను రవాణా చేసేందుకు ఉపయోగించే 24 క్రయోజనిక్‌ కంటైనర్లను దిగుమతి చేసుకుంటున్నట్టుగా నిన్న టాటా గ్రూప్‌ ప్రకటించింది. వీటి ద్వారా ఆక్సిజన్‌ కొరతను తగ్గించడానికి తమ వంతుగా తాము ప్రయత్నాలు చేస్తున్నామని టాటా గ్రూప్‌ వారా ప్రకటించింది. అయితే ఈ అంశంలో టాటా గ్రూప్‌ నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. కరోనాను ఎదుర్కొనే సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు తమ సంస్థ అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని స్పష్టం చేసింది టాటా గ్రూప్. చార్టెడ్ ఫ్లైట్స్ ద్వారా ఈ క్రయోజనిక్ కంటైనర్లను దిగుమతి చేసుకుంటున్నట్లు పేర్కొంది. 


అసలు ఏమిటీ  క్రయోజనిక్‌ కంటైనర్ ?

లిక్విడ్ సిలిండర్లు అని కూడా పిలువబడే క్రయోజెనిక్ కంటైనర్లు మల్టీ ఇన్సులేషన్ కలిగిన రెండు గోడల వాక్యూమ్ నాళాలు. అవి క్రయోజెనిక్ ఉష్ణోగ్రత వద్ద ద్రవీకృత వాయువులను లిక్విడ్ గా మార్చి రవాణా చేయడానికి, లేదా నిల్వ కోసం రూపొందించబడ్డాయి, సాధారణంగా -130 ° F (–90 ° C) కంటే చల్లగా ఉంచడానికి వీటిని రూపొందించారు

ఇక ఆక్సిజన్ కొరత తీర్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ప్రత్యేక చర్యలు చేపట్టింది. జామ్ నగర్లోని రిఫైనరీ నుంచి రోజుకు 700 టన్నులకు పైగా.. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నట్లు చెబుతున్నారు. నిజానికి ముందు ఇక్కడ రోజుకు 100 టన్నుల ఆక్సిజన్ను మాత్రమే ఉత్పత్తి చేసింది రిలయన్స్. చాలా ప్రాంతాల్లో ప్రాణవాయువు అవసరం పెరుగుతున్న నేపథ్యంలో రిలయన్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచినట్లు సమాచారం. ఉత్పత్తి పెంపు ద్వారా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ లలో రోజుకు 70,000 మంది రోగులకు ఆక్సిజన్ అందించే వీలు కలగనుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: