ప్రస్తుతం శరవేగంగా కరోనా సెకండ్ వేవ్ తన విజృంభణను కొనసాగిస్తోంది.పెరుగుతున్న సంఖ్య.. వేగం, చూస్తుంటే కరోనా ఇప్పుడప్పుడే ప్రపంచాన్ని వీడేలా కనిపించడం లేదు. మరో వైపు వ్యాక్సినేషన్ జనసాంద్రతకు తగ్గ పరిమాణంలో వెంటనే, అతి తక్కువ సమయంలో ఉత్పత్తి చేయడం అసాధ్యం. ఉన్న తక్కువ కరోనా వ్యాక్సిన్ లు మా వరకు వస్తుందో లేదో.. అందుతుందో లేదో అని ఆందోళన చెందుతున్న ప్రజలకు ఓ సూపర్ గుడ్ న్యూస్ వినిపించారు సైంటిస్టులు. యాంటీ వైరల్ డ్రగ్ మొల్నుపిరావిర్ కోవిడ్ 19 పై సమర్ధవంతంగా పని చేస్తోందని అధికారికంగా ప్రకటించారు. ఈ మెడిసిన్ (టాబ్లెట్) తీసుకున్న 24 గంటల వ్యవధిలోనే శరీరంలో ప్రభావం చూపి కరోనా వైరస్ ను పూర్తిగా కంట్రోల్ చేస్తోందట. అదేవిధంగా కరోనా వైరస్ రోగి నుండి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఆపగలిగే సామర్థ్యం దీనికి ఉందట.

కాబట్టి కరోనా పాజిటివ్ వ్యక్తి ఈ టాబ్లెట్ తీసుకున్నట్లయితే.. ఆ వ్యక్తి నుండి నుండి మరొకరికి సోకకుండా ఇది ఆపుతుందని చెబుతున్నారు పరిశోధకులు. కోవిడ్ ట్రీట్మెంట్ లో ఈ మెడిసిన్ గేమ్ చేంజర్ గా పనిచేస్తోందని చెబుతున్నారు . జార్జియా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఈ రీసెర్చ్ డీటెయిల్స్ నాచురల్ మైక్రోబయాలజీ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. టాబ్లెట్ రూపంలో లభించే ఈ ఔషధం కరోనాపై పోరాడి అంతం చేస్తుందని అంటున్నారు సైంటిస్టులు.  టాబ్లెట్ వేసుకున్న 24 గంటల్లోనే దీని ప్రభావం చూపుతుందంటున్నారు. జంతువులకు మొల్నుపిరావిర్ ఇచ్చినపుడు వైరస్ సంఖ్య పెరగకుండా కంట్రోల్ అయింది. పైగా కరోనా సోకని జంతువులని కూడా అదే బోనులో ఉంచినప్పటికీ వాటికి వైరస్ వ్యాపించలేదు.

మనుషులకు ఈ మెడిసిన్ ఇవ్వడం వలనా కోవిడ్ వ్యాప్తిని బ్రేక్ చేయొచ్చు అంటున్నారు పరిశోధకులు. ప్రస్తుతం వాడకంలో ఉన్న  వ్యాక్సిన్ ఎఫెక్టివ్ గా పనిచేయడానికి వారం నుండి పదిహేను రోజులపాటు పడుతుండగా ఈ టాబ్లెట్ మాత్రం తీసుకున్న 24 గంటల్లోనే ప్రభావం కనిపిస్తోంది అని చెబుతున్నారు. మొల్నుపిరావిర్ వల్ల మూడు రకాల ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. కోవిడ్ లక్షణాలు కనిపించిన వారికి ఇస్తే వెంటనే వైరస్ ప్రభావం పెరగకుండా కంట్రోల్ అవ్వడమే కాకుండా, ఇతరులకు కూడా వ్యాపించకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా వైరస్ తీవ్రత ఎక్కువయ్యి ప్రమాదంలో ఉన్నవారికి ఈ టాబ్లెట్ ఇవ్వడం వలన మరింత ముదరకుండా ఆపొచ్చు. ఇన్ఫెక్షన్ స్టేజి కూడా తక్కువ కాలమే ఉంటుంది దీని వలన రోగులకు మానసిక, ఆర్ధిక సమస్యలు తగ్గుతాయంటున్నారు. ప్రస్తుతం ఈ మెడిసిన్ ఫేజ్ 2/3 క్లినికల్ ట్రయల్స్ లో ఉంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రాబోతుంది. ఇది కనుక అందుబాటులోకి వస్తే ఇక ఈ ప్రపంచానికి కరోనా వైరస్ నుండి అతిత్వరలోనే విముక్తి కలుగుతుందంటున్నారు  పరిశోధకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: