కరోనా వైరస్ మహమ్మారి ఉప్పెనలా విరుచుకుపడుతుంది. ప్రపంచం మొత్తం కరోనా కారణంగా గడ గడ వణికిపోతోంది. కరోనా ఊహించని స్థాయిలో విజృంభిస్తోంది. మరోవైపు ప్రస్తుతానికి దేశంలో లాక్ డౌన్ ఉండదని ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చారు. కానీ, పరిస్థితి అయితే చేయిదాటిపోయినట్టే కనిపిస్తోంది. నమోదవుతున్న కేసులు చూస్తుంటే. అందుకే చాలా రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూలు విధించాయి.చాలా ఘోరంగా ఈ వైరస్ విలయతాండవం చేస్తుంది. ఇక కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య కూడా క్రమ క్రమంగా పెరుగుతోంది. అలాగే ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువై పోతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.ఇక విషయానికి వస్తే టీకా తీసుకున్న తరువాత కూడా కరోనా బారిన పడుతూ వున్నారు.కొవాగ్జిన్ వ్యాక్సిన్ రెండు డోసులూ తీసుకున్న వారిలో 0.04 శాతం మంది కరోనా బారిన పడ్డట్టు తాజాగా వెల్లడైంది.


ఇక కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న వారిలో 0.03 శాతం మంది కరోనా బారినపడ్డట్టు తెలిసింది. ఈ సమాచారాన్ని భారత వైద్య ఆరోగ్య పరిశోధన మండలి పేర్కొంది. ''కొవిడ్ టీకా తీసుకున్నాక ప్రతి 10 వేల మందిలో అత్యధికంగా నలుగురు కరోనా బారినపడ్డారు'' అని ఐసీఎమ్ఆర్ చీఫ్ భార్గవ తెలిపారు. టీకా తీసుకుని కరోనా కాటుకు గురైన వారిలో వ్యాధి తీవ్రత చాలా తక్కువగా ఉందని కూడా నితీ అయోగ్ సభ్యుడు కేఏ పాల్ పేర్కొన్నారు. కరోనాను అడ్డుకోవడంలో కోవిషీల్డ్ ప్రభావశీలత దాదాపు 70 శాతమన్న సంగతి తెలిసిందే.ఇక ఫేజ్ 3 ప్రయత్నాల ఫలితాల మధ్యంతర విశ్లేషణలో కొవాగ్జిన్ సామర్థ్యం 81 శాతంగా ఉన్నట్టు బయటపడింది. ఈ రెండు టీకాలను రెండు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. రెండో డోసు తీసుకున్న 15 రోజుల తరువాత తగినంత స్థాయిలో శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని నిపుణులు తెలుపుతున్నారు.కాబట్టి జాగ్రత్తలు పాటించండి..

మరింత సమాచారం తెలుసుకోండి: