ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. అంతే కాదు ప్రతి ఒక్కరిలో భయానికి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది కరోనా. వైరస్ మొదటి వేవ్ కంటే సెకండ్ వేగంగా విస్తరిస్తూ ఉన్న నేపథ్యంలో ఎంతో మంది బెంబేలెత్తిపోతున్నారు. అయితే కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఈ మహమ్మారి మాత్రం పంజా విసురుతోంది. అయితే రోజురోజుకు వైరస్  విజృంభిస్తున్న తీరు చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అన్నది కూడా ఊహకందని విధంగా ఉంది. ఈ మధ్య కాలంలో అయితే మానవ బంధాలు బంధుత్వాలు ఒక విలువ లేకుండా చేస్తుంది వైరస్.



కరోనా  వైరస్ సోకింది అనే కారణంతో ఎంతోమంది తమ సొంత వాళ్లని కూడా దూరం పెడుతున్నారు అయితే కరోనా వైరస్ పట్ల ఎక్కువ భయపడాల్సిన పని లేదని కాస్త జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది అని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబంలో వైరస్ బారిన పడిన సమయంలో ఇక కరోనా రోగుల ను ఎక్కడ ఉంచాలి అని ఆందోళన చెందుతూ ఉంటారు. ఎందుకంటే వేరువేరు గది లేనప్పుడు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా వైరస్ సోకిన వ్యక్తికి చికిత్స అందించాలి అన్నది చాలామందికి తెలియక ఆందోళన చెందుతూ ఉంటారు.


 కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నప్పుడు ఇంట్లోని ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.. అతని బట్టలు ఉతికే సమయంలో క్రిమి సంహారక మందులు వేసి శుభ్రం చేయడం లాంటివి చేయాలి. అంతే కాకుండా ఇంట్లో అందరికీ కలిపి కామన్ బాత్ రూమ్ ఉంటే తరుచు బాత్రూంలో క్రిమిసంహారక మందుతో క్లీన్ చేస్తూ ఉండడం ఎంతో ఉత్తమం అంతే కాకుండా  వైరస్ బారిన పడిన వ్యక్తి గది లోకి నేరుగా ప్రవేశించకూడదు ఎందుకంటే పూర్తిగా రూమ్ మొత్తం వైరస్ వ్యాప్తి చెంది ఉంటుంది కాబట్టి  ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. ఇలా ఒకే ఇంట్లో ఉన్న సమయంలో తరచుగా శానిటైజర్ రాసుకోవడం కూడా మంచిదే వైరస్ బారిన పడిన వ్యక్తి వాడే అన్ని రకాల వస్తువులను కూడా ప్రత్యేకంగా పెట్టాలి. ఇలా తగిన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని కంగారు పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: