కరోనా విధ్వంసం సృష్టిస్తుంది.దేశమంతా దీని గుప్పిట్లో నలిగిపోతూ పోతూ వుంది. ఈ కరోనా రోజుకి ఎంతోమందిని బలి తీసుకుంటుంది.ఎప్పుడు ఎంతమంది చనిపోతున్నారో ఎవరి మరణ వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితుల్లో చాలామంది కొట్టు మిట్టాడుతూ చాలా భయంగా కాలం గడుపుతున్నారు. ప్రపంచం మొత్తం కరోనా కారణంగా గడ గడ వణికిపోతోంది. కరోనా ఊహించని స్థాయిలో విజృంభిస్తోంది. మరోవైపు ప్రస్తుతానికి దేశంలో లాక్ డౌన్ ఉండదని ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చారు. కానీ, పరిస్థితి అయితే చేయిదాటిపోయినట్టే కనిపిస్తోంది. నమోదవుతున్న కేసులు చూస్తుంటే. అందుకే చాలా రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూలు విధించాయి.చాలా ఘోరంగా ఈ వైరస్ విలయతాండవం చేస్తుంది. ఇక కరోనా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య కూడా క్రమ క్రమంగా పెరుగుతోంది. అలాగే ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువై పోతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో స్మశానాలు కూడా కిక్కిరిసిపోతున్నాయి. ఇక కరోనా వైరస్ విశ్వరూపమేంటో గుంటూరు జిల్లాలోని ఈ స్మశానవాటికను చూస్తే తెలిసిపోతుంది. ఎటు చూసినా తగలబడుతున్న చితులే కనిపిస్తాయి.ఇక గుంటూరు బొంగరాలబీడు స్మశానవాటిక తీవ్రమైన భయాన్ని కలిగిస్తుంది. అక్కడికి వచ్చే మృతదేహాల్లో ఎక్కువగా కరోన మృతదేహాలే ఉండడం భయబ్రాంతులని చేస్తుంది.

ఇక్కడ గత రెండు రోజుల్లో భారీ సంఖ్యలో మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. మంగళ, బుధ వారాల్లో ఏకంగా 92 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి.సాధారణ రోజుల్లో ఈ స్మశానంలో రోజుకు 4 నుంచి 5 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. కానీ ఇటీవలి కాలంలో ఈ సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన నాలుగు రోజుల్లో ఏకంగా 141 మృతదేహాలకు ఇక్కడ అంత్యక్రియలు చేశారు.జీజీహెచ్, కొత్తపేటలోని ప్రేవేట్ ఆస్పత్రుల నుంచి ఇక్కడికి మృతదేహాలను తరలిస్తున్నారు. బొంగరాలబీడుతో పాటు గుంటూరులోని మొత్తం 11 స్మశాన వాటికలకు మృతదేహాల తాకిడి ఎక్కువైంది.ఇక్కడి స్మశానాలకు తరలిస్తున్న మృతదేహాల్లో 90శాతం కోవిడ్ మరణాలేనని తెలుస్తోంది. అయితే కొందరి డెత్ సర్టిఫికెట్‌లో మాత్రం గుండెపోటుతో, దీర్ఘకాలిక వ్యాధులతో చనిపోయినట్లుగా చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: