దేశంలో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోహిస్తున్న వేళ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేసేందుకు నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే మొదటి విడతలో భాగంగా 60 సంవత్సరాలు దాటిన వారికి వైద్యం అందించాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఆ తర్వాత 45 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్ అందించే ప్రక్రియను కొనసాగిస్తుంది. అయితే ప్రస్తుతం రోజురోజుకీ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక  అందరికీ వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.


 మే 1వ తేదీ నుంచి ఈ మహాత్తరా గట్టానికి శ్రీకారం చుట్టనుంది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో లాగానే ఇప్పుడు కూడా అదే ప్రక్రియను కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.  మే ఒకటి నుంచి వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారు  రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా ఎల్లుండి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మే 1వ తేదీ నుంచి వ్యాక్సిన్ వేసుకోవాలంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కోవిన్ యాప్ లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.



 ఏప్రిల్ 24వ తేదీ నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే కరోనా వైరస్ టీకాలు వేస్తూ ఉండగా మే 1వ తేదీ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ లలో కూడా  వైరస్ టీకా వేయనున్నారు. వ్యాక్సిన్  18 ఏళ్ళు నిండిన వారికి అని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఈ   టీకా తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సిన్ గురించి తెలియని వారికి కూడా తెలియజెప్పి టీకా తీసుకునేందుకు ముందుకు వచ్చేలా అవగాహనా కల్పించాలని అధికారులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: