ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఆగడం లేదు. సర్కార్ చర్యలు తీసుకున్నా సరే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కేసులు ఆగడం లేదు. ఇక ఏపీ సర్కార్ వరుసగా సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కలెక్టర్లు , స్పెషల్ ఆఫీసర్లతో జవహర్ రెడ్డి జూం కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రైమరీ కాంటాక్ట్ పెండింగ్ టెస్టుల్ని తక్షణమే క్లియర్ చేయాలి అని టెస్టుల్ని తక్షణమే పెంచాలి అని స్పష్టం చేసారు. జిల్లా కలెక్టర్లకు స్టేట్ కొవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఛైర్ పర్సన్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు.

కొవిడ్ నిర్ధారణకు ట్రునాట్ టెస్టులు కూడా  చేపట్టేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. భారీ స్థాయిలో కొవిడ్ టెస్టులు చేపట్టాల్సిందే అని అన్నారు. కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో   తనిఖీలు చేపడితే తప్ప పరిస్థితి అదుపులోకి రాదు అని వెల్లడించారు. అదే విధంగా మరికొన్ని వ్యాఖ్యలు చేసారు. కొవిడ్ వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోంది అని అన్నారు. 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా కలెక్టర్లు రంగంలో కి దిగాలి అని స్పష్టం చేసారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేసారు.

కొవిడ్ కేర్ సెంటర్లను తక్షణం అందుబాటులో కి తేవాలి అని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా  19000 బెడ్లు మాత్రం అందుబాటులో ఉన్నాయి అని అన్నారు.  మిగిలిన 19000 బెడ్లు కూడా అందుబాటులోకి తేవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. 104 కాల్ సెంటర్  సేవలపై  విస్తృతంగా ప్రచారం చేయాలి అని వివరించారు.  104 కు వచ్చే ప్రతి రిక్వెస్ట్ నూ  సంబంధిత అధికారులకు కనెక్ట్ చేయాలి అని కోరారు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: