చదువుకున్న వారి కంటే చదువుకోని వారు మేలు అని గతంలో చాలా సార్లు రుజువు అయ్యింది. ఒక పక్క కరోనా మనుషుల ప్రాణాలతో బంతాట ఆడుతుంటే రెండ్రోజుల క్రితం ఢిల్లీలో చదువుకున్న ఓ జంట బాధ్యత లేకుండా కారులో చక్కర్లు కొడుతూ మాస్క్ ధరించకపోగా పోలీసులతో సిగ్గు లేకుండా గొడవ పెట్టుకొని నవ్వుల పాలయ్యారు. అలాగే విమర్శల పాలయ్యారు. అలాంటి బాధ్యత లేని నీచపు మనుషులు తనని చూసి సిగ్గు పడేలా చేశాడు ఈ పెద్దాయన.

ఈ పెద్దాయన పింఛన్ తీసుకోవడానికి నేరుగా పొలం నుంచి ఇలా పిట్టగూడును మాస్క్ లా ధరించి రావడంతో అక్కడ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం చిన్న మునుగల్ చేడ్ గ్రామానికి చెందిన ఈ తాత .. ఇప్పుడు అందరి దృష్టిలోపడ్డాడు. పెన్షన్ కోసం తన పొలం నుంచి అడ్డాకులకు వచ్చిన ఆయన.. ఇలా పిట్టగూడు మాస్కు ధరించి కనిపించాడు. దీన్ని చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. మాస్క్ లేకపోయినా.. ఆయన ముందు జాగ్రత్తను చూసి మెచ్చుకోలేక ఉండలేకపోయారు. కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న వేళ.. దాన్నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సిన్ కంటే కూడా మాస్క్ అవసరమే ఎక్కువైపోయింది. ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే మాస్క్ తప్పనిసరి అని ఎంత అవగాహన కల్పించినా..చాలా మంది బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు.


పైగా వారు మాస్క్ ధరించకపోగా.. తమ నుంచి వేరే వాళ్లకు వైరస్ వ్యాపించేందుకు కారణమవుతున్నారు.కానీ మాస్క్ లేకపోయినా..కావాల్సినంత కామన్‌సెన్స్ ఉందని నిరూపించాడు ఈ పెద్దాయన. ఎవరూ ఊహించని విధంగా తనకు అందుబాటులో ఉన్న వస్తువును నోటికి అడ్డంగా పెట్టుకుని మాస్క్ పట్ల నిరక్ష్యం వహించే వారి కళ్లు తెరిపించి వారు సిగ్గు పడే ప్రయత్నం చేశాడు. పింఛన్లు పంచే బీపీఎం మురళీ ఈ పెద్దాయన ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో నెట్టింటా వైరల్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: