ఇపుడు మనిషికి మనిషే శత్రువు. ఎదుటి మనిషి ఎవరు అయినా ఇదే సీన్. అతి బంధువైనా, పొరుగువాడు అయినా ఒక్కటే. అంత మాట వరకూ ఎందుకు బయటకు వెళ్ళి ఇంటికి వస్తే ఆ మనిషి మీద కూడా ఇతర సభ్యులు అనుమానంగా చూడడం కూడా జరుగుతోంది.

అసలు ఈ బాధ అంతా ఎందుకు అనుకున్నాడో ఏమో విశాఖ జిల్లా భీమిలీలో ఒక ఆసామి అయితే ఏకంగా తన ఇంటికి ఎవరూ రావద్దు అంటూ పెద్ద బోర్డే తగిలించి పెట్టేశాడు. కనీసం ఇరుగు పొరుగు వారు కూడా ముచ్చట్లు పెట్టేందుకు అసలు రావద్దంటే రావద్దు అని కరాఖండీగా చెప్పేశారు. తనకు ఈ విషయంలో ఎలాంటి మొహమాటం ఉన్నా కూడా కరోనాలు లేదన్న సంగతి గుర్తుంచుకోవాలని కూడా ఆయన అంటున్నాడు.

కరోనా బాగా తీవ్రంగా ఉన్న నేపధ్యంలో ఎవరు అయినా అనుమానంగానే చూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అందుకే ఎవరూ మా ఇంటికి రావద్దు, మీ ఇంటికి రమ్మని అసలు పిలవవద్దు అంటున్నాడు. నిజంగా ఇది చాలా మంచిదని అంతా అంటున్నారు. ఎందుకంటే కరోనా విషయంలో ఇంతటి కఠినంగా ఉండకపోవడం వల్లనే అది విచ్చలవిడిగా స్ప్రెడ్ అవుతోందని అంటున్నారు.

కొన్నాళ్ల పాటు ఎవరి ఇళ్లల్లో వారు ఉండడం అవసరం అయితే తప్ప బయటకు వెళ్లకపోవడం వంటివి కనుక చేస్తే కరోనా గొలుసులను తెంచగలమని కూడా చెబుతున్నారు. మొత్తానికి ఇపుడు బంధాలు తెంచుకుంటేనే తప్ప కరోనా సంకెళ్ళను తెంపలేమన్న వైద్య పరిశోధకుల మాటలు అచ్చమైన నిజాలు. అందరూ దాన్ని అనుసరించాల్సిన అవసరం కూడా ఉంది మరి. గుంపులుగా ఉండడం, పార్టీలు చేసుకోవడం, పిచ్చాపాటీ చెప్పుకోవడం అన్నవి భారతీయులకే ఎక్కువగా అలవాటు అయిన విషయాలు. అయితే ఇపుడు అవే కరనా డేంజర్ బెల్స్ ని మోగిస్తున్నాయి. కాబట్టి ఎవరూ కూడా గతంలో మాదిరిగా విచ్చలవిడితనం చేయవద్దు అనే అంతా సూచిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: