దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం రావడం లేదు. లాక్ డౌన్ విధించాలి అని కొందరు డిమాండ్ చేస్తున్నా ఆ విధంగా కేంద్రం మాత్రం ముందుకు వెళ్ళడం లేదు. జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల మాట్లాడిన సందర్భంగా అందరూ లాక్ డౌన్ గురించి చెప్తారని భావించారు. కాని ఆయన మాత్రం లాక్ డౌన్ అనేది చివరి అస్త్రం అంటూ తప్పించుకున్నారు. ఇక రాష్ట్రాలు మాత్రం లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి.

తెలంగాణా కూడా లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా సుప్రీం కోర్ట్ లో కరోనాపై విచారణ జరిగింది. దేశంలో కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో సంక్షోభ నివారణకు వివిధ రాష్టాలు తీసుకుంటున్న చర్యల పై కేసును సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు... దీనిపై విచారణ జరిగింది. ఢిల్లీ, బాంబే, సిక్కిం, మధ్యప్రదేశ్, కలకత్తా, అలహాబాద్ హైకోర్టుల్లో  పలు కేసులు నమోదు అవ్వడంతో గందరగోళం నివారణకు కేసు విచారణను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం చేపట్టింది.

అమికస్  క్యూరీగా (కోర్టు కు లీగల్ సలహాలు) హరీష్ సాల్వే ను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నియమించింది. నాలుగు అంశాలను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. 1) దేశంలో ఆక్సిజన్ సరఫరా, 2) అత్యవసర మందుల సరఫరా, 3)టీకా విధానం, టీకాల నిర్వహణ, 4) లాక్ డౌన్ ఎత్తివేసే అధికారం అంశాల పై విచారణకు ముందుకు వెళ్తారు. లాక్ డౌన్ ఎత్తి వేసే అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో అంశమని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం... విచారణ రేపటికి  వాయిదా వేసింది.  దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ ఉంది అంటూ సుప్రీం కోర్ట్ మండిపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: