ఏపీ కాంగ్రెస్ పార్టీ స‌మ‌న్వ‌య క‌మిటీ స‌భ్యురాలు సుంక‌ర ప‌ద్మ‌శ్రీ కీలక వ్యాఖ్యలు చేసారు. క‌రోనా బారి నుంచి ర‌క్షించే వారు లేక నేడు ఏపీ ప్ర‌జ‌లు ఆనాధలుగా మిగిలారు అని ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారీ విల‌య‌తాండవం చేస్తుంటే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తాడేప‌ల్లి పాల్యెస్ లో రివ్యూల‌తో కాల‌క్షేపం చేస్తున్నారు అని మండిపడ్డారు. ముఖ్య‌మంత్రి ప్ర‌క‌ట‌న‌ల‌కు వాస్త‌వ ప‌రిస్థితుల‌కు చాల వ్య‌త్యాసం ఉంటుంది అని అన్నారు. క‌రోనా వైర‌స్ పై ప్ర‌జ‌ల్లో భ‌రోసా నింప‌డంలో ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌ల‌మైంది అని వెల్లడించారు.

క‌రోనా ధాటికి ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. గ్రామీణ ప్రాంతాల్లో క‌రోనా టెస్టులు ఎక్క‌డ చేస్తారు ? క‌రోనా టీకాలు ఎక్క‌డ వేస్తారు అనేది ఇప్ప‌టికి ప్ర‌జ‌ల‌కు తెలియ‌దు అని అన్నారు. స్కూల్స్ కు సెల‌వులిచ్చారు సంతోషం కానీ మ‌ద్యం దుకాణాల‌ను ఎందుకు మూయ‌డం లేదు ? అని నిలదీశారు. మద్యం షాపుల వ‌ద్ద ఎంత ర‌ద్దీగా ఉంటుందో ప్ర‌భుత్వానికి క‌నిపించ‌డం లేదా ? అని ప్రశ్నించారు. త‌క్ష‌ణ‌మే మ‌ద్యం షాపుల‌ను మూసి వేయాలి అని డిమాండ్ చేసారు. ప్ర‌జ‌ల ప్రాణాలు పోయినా ప‌ర్వాలేదు మాకు మాత్రం ఆదాయమే కావాలి అన్న‌ట్లు ఉంది ప్ర‌భుత్వ వ్య‌వ‌హ‌రం అని మండిపడ్డారు.

క‌రోనాతో హస్పిట‌ల్ కి వెళ్లితే ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు అందుబాటులో ఉండ‌వు అని అన్నారు. రోజూ వేల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు నమోద‌వుతున్నా ప్ర‌భుత్వం క‌ళ్లు తెర‌వ‌డం లేదు అని మండిపడ్డారు. రోగులకు ఇబ్బంది లేకుండా వెంటనే ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు అందుబాటులో ఉంచాలి అని కోరారు. ఇంకా ఎంత‌మంది చ‌నిపోతే ముఖ్య‌మంత్రి స్పందిస్తారు ? అని నిలదీశారు. ముఖ్య‌మంత్రి ఇక‌నైనా తాడేప‌ల్లి ప్యాలేస్ లో కూర్చుని  ఆదేశాలు జారీ చేయ‌కుండా క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించాలి అని ఆమె విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: