ప్రపంచ వ్యాప్తంగా కరోన ఉదృతి ని చూసి భయపడే పరిస్థితి నెలకొంది అని తెలంగాణా ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర అన్నారు. సెకండ్ వేవ్ ను ఎవరు ఊహించలేదు అని ఆయన వెల్లడించారు. కరోన పై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అని నేడు మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. రేమ్డేసివర్ కొరత లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు అని ఆయన అన్నారు. దానిలో భాగంగా మరో నాలుగు లక్షల ఇంజక్షన్లు ఆర్డర్ ఇచ్చాము అని వివరించారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారినుండి వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంది అని అన్నారు.

మైలన్ , రెడ్డి , హెటేరో లాంటి లాంటి సంస్థలు మన దగ్గరే తయారు చేస్తున్నారు అని నిన్న కేంద్రం చేసిన ప్రకటన బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేసారు. హైదరాబాద్ లోని చాలా ఆసుపత్రుల్లో 70శాతం పైగా ఇతర రాష్ట్రాల కు చెందిన బాధితులు ఉన్నారు అని అన్నారు. హర్ష వర్ధన్ తో నిన్ననే మాట్లాడినం అని ఆయన చెప్పుకొచ్చారు. మా రాష్ట్రానికి రావాల్సిన మెడిసిన్ మాకే పంపాలని కేంద్రానికి లేఖ రాస్తాము అని ఆయన అన్నారు. తెలంగాణ లో సగటున రోజు 260 టన్నుల ఆక్సిజన్ వాడుతున్నాం. ఇది ఇంకా పెంచతున్నాం అని చెప్పుకొచ్చారు.

 వ్యాక్సిన్ విషయంలో తెలంగాణ పై కేంద్రం వివక్షను ప్రదర్శిస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేసారు. గుజరాత్ తో పోలిస్తే తెలంగాణకు కేటాయించినది ఎంతో కేంద్రం స్పష్టం చేయాలి అని డిమాండ్ చేసారు. తెలంగాణలో ఎక్కడ ఆక్సిజన్ కొరత లేదు అని అన్నారు. బ్లాక్ లో ఆక్సిజన్ సరఫరా చేసినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటాం అని వెల్లడించారు. ఆక్సిజన్ పై ఐ ఏ ఎస్ ల బృందం నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది అని ఆయన అన్నారు. తమిళనాడు తరహాలో మా ఆక్సిజన్ ని మేమే వాడుకుంటాం అని తెలిపారు అనొచ్చు కానీ అందరి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం అలా చేయడం లేదు అన్నారు.గాంధీ ఆస్పత్రిలో ఆక్సీజన్ బెడ్స్  మాత్రమే కాళీ ఉన్నాయని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: