కేంద్రం పిడుగుపాటు వార్త చెప్పింది, రెమిడిసివిర్ ఇంజక్షన్ లను కేంద్రం పరిధిలోకి తీసుకొందని ఈటల రాజేందర్ అన్నారు. చాలా బాధాకరం గా ఉందన్న ఆయన కేంద్రానికి నిరసన వ్యక్తం చేస్తున్నామని అన్నారు. మా రాష్ట్రంలో ఉత్పత్తి అయిన రెమిడిసివిర్ మాకు అవసరం ఉన్నంత ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాస్తున్నానని ఆయన అన్నారు. రెమిడిసివిర్ కొరత రాకుండా.. 4 లక్షల వైల్స్ కి ఆర్థర్ పెట్టామని హైదరాబాద్ కు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక పేషేంట్లు వస్తున్నారని అన్నారు. అన్ని రాష్ట్రాల వారికి వైద్యం చేస్తున్నామని ఆక్సిజన్ సైతం సరిగ్గా సప్లై చేయటం లేదని అన్నారు. 

ప్రజలు ఎవరయినా ప్రజలే సమస్యను జఠిలం చేయొద్దన్న ఆయన తెలంగాణ పై అసమానత చూపెడుతున్నారని అన్నారు. వాక్సిన్ విషయంలో కేంద్రం ముందస్తు ఆలోచన చెయ్యలేదని అన్నారు. తెలంగాణకు రోజుకు 10 లక్షల వాక్సినేషన్ కెపాసిటీ ఉందన్న ఆయన కేంద్రం కంట్రోల్ లో పెట్టుకోవటం లో తప్పు లేదు కానీ రాష్ట్రాల అవసరాలు తీర్చాలని అన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి, కేటాయింపులు చెయ్యాలన్న ఆయన శవాల పై పేలాలు ఎరుకుంటున్నారని అన్నారు. బ్లాక్ లో అమ్మటం సహించలేమన్న ఆయన ఆక్సిజన్ కొరత, మందుల కొరత లేకుండా బ్లాక్ మార్కెట్ పై ద్రుష్టి పెట్టామని అన్నారు.

బ్లాక్ మార్కెట్ పై ఉక్కు పాదం మోపుతామని ఆక్సిజన్ కొరత, బెడ్స్ కొరత, రేమిడిసివిర్ కొరత రాదు... రానివ్వమని అన్నారు. హైదరాబాద్ హెల్త్ హబ్ అని పేర్కొన్న ఆయన ఇక్కడికి అన్ని రాష్ట్రాల వాళ్ళు ట్రీట్మెంట్ పొందుతున్నారు, గాంధీలో ఆక్సిజన్ బెడ్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయని అన్నారు. 260  టన్స్ ఆక్సిజన్ మాత్రమే తెలంగాణ కు వస్తోందన్న ఆయన  రోజుకి 384   టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతోంది... కాని 260 నుంచి 270 టన్నులే వస్తోందన్నారు. గుజరాత్ ను ఒకలా.. తెలంగాణ ను మరోలా చూడొద్దన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: